ప్ర : నాది గ్రామీణ నేపథ్యం, కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. సొంతంగా ప్రిపేర్ అవుతున్నాను. డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పూర్తి చేశాను. గ్రూప్-2లో మొదటి, రెండవ పేపర్లకు భాగానే ప్రిపేరవుతున్నాను. కానీ ఎకానమి పేపర్ గందరగోళంగా ఉంది. ఎకానమీకి అకాడమీ పుస్తకాలు చదువుతున్నాను. కానీ అవి గ్రూప్-2 సిలబస్‌కు అనుగుణంగా లేకపోవడం వలన ఏవి చదవాలో, ఏవి వదిలేయాలో తెలియడం లేదు. ఎకానమీలో నేను గట్టెక్కడానికి పరిష్కారం చూపగలరు? - అప్పాన సూర్య, కొత్తకోట.
జ : ముందుగా మీరు మానసికంగా ప్రిపేర్‌కావాలి. గ్రామీణ నేపథ్యం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తో ఐ.ఎస్ సాధించిన ఉదహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆత్మవిశ్వాసంతో ఆశావాద దృక్పథంతో ప్రిపేర్ కాగలిగితే అంతిమ విజయం మీదేనని బలంగా నమ్మాలి. వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలను పొందుతున్నప్పుడు అది మనెందుకు సాధ్యం కాదన్న ప్రశ్న వేసుకోవాలి. గ్రూప్-2లో ఉద్యోగం పొందాలంటే డిగ్రీలు, కోచింగ్‌లు, ఆర్థిక స్థోమత, అదృష్టం వంటి అంశాలకన్నా కఠోర దీక్షతో, పట్టుదలతో నిరంతరం తెలుసుకోవాలన్న తపనతో, సాధించాలన్న కసితో ఒక యజ్ఞంలాగా సరైన గైడెన్స్‌తో శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేర్ కావడానికే అధిక ప్రాధాన్యనివ్వాలన్న విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక గ్రూప్-2 ఎకానమి పేపర్‌లో అత్యదిక మార్కులు పొందాలంటే కొంచెం ఎక్కువ సమయం కేటాయించి, ఎక్కువగా కష్టపడటం తప్పనిసరి. ఎకానమికి సంబంధించిన మౌలికమైన అంశాలను తెలుసుకోవడానికి తెలుగు అకాడమి ఇంటర్ స్థాయి పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. అదే విధంగా గ్రూప్స్ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అకాడమి పుస్తకాలను చదివేటప్పుడు, సిలబస్‌ను ముందు పెట్టుకొని అందులోని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పాయింట్ల రూపంలో నోట్ చేసుకోవాలి. అదే విధంగా రోజూ పేపర్లలో వస్తున్న ఎకానమీ సంబంధిత అంశాలను, పోటీపరీక్షల మ్యాగ్‌జైన్‌లలో వున్న అంశాలను నిరంతరం అనుసంధానించు కుంటూ చదవగలిగితే గరిష్ట మార్కులు పొందవచ్చు.
No comments:
Post a Comment
Google Sign-in enabled to reduce spam...