ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఈ నోటిఫికేషన్ల కోసం లక్షలాదిమంది అభ్యర్ధులు ఎదురుచూస్తున్నారు. వివిధ కారణాలవలన లేటయిన ఈ నోటిఫికేషన్లలో పంచాయతీ సెక్రటరి, వి.ఆర్.ఒ, గ్రూప్-2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్... ఇలా వివిధ రకాల పోస్టులున్నాయి. ఇవేకాక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇతర పోస్టులను భర్తీచేయడానికి ఆవెూదం తెలిపింది. మరి ఈ పోస్టులకు ఎలా ప్రిపేర్ కావాలి? ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఎటువంటి వ్యూహం అవలంభించాలి?
తెలివైన అభ్యర్థ్ధులు ముందే మేల్కొంటారు
సాధారణంగా పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధుల్లో 70 నుంచి 80శాతం మంది అభ్యర్ధులు నోటిఫికేషన్ వచ్చిన తరువాతే తమ ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. దీనికి ప్రధాన కారణం నోటిఫికేషన్లు వస్తాయో, రావో ఒకవేళ వచ్చినా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఎలా ప్రిపేరవుతామని అభ్యర్ధులు భావించడమే. కానీ సరిగ్గా ఇక్కడే తెలివైన అభ్యర్ధులు తమ తెలివితేటలు ప్రదర్శిస్తారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అని ఒకపక్క ఆరా తీస్తూనే మరోపక్క తమ ప్రిపరేషన్ ప్రారంభించి కొనసాగిస్తూనే ఉంటారు. దీనివలన నోటిఫికేషన్ వచ్చేనాటికి వీరి ప్రిపరేషన్ ఒకసారి పూర్తయిపోవడవెూ లేక మెజారిటీ పోర్షన్ కంప్లీట్ చేయడవెూ జరుగుతుంది. ఫలితంగా పరీక్ష తేదీనాటికి వీరు అనేకసార్లు సిలబస్ రివిజన్ చేసి పరీక్షలకు పూర్తి సంసిద్ధులై ఉంటారు. మిగిలినవారంతా ప్రిపరేషన్ పూర్తిచేయలేక, ఒకవేళ పూర్తిచేసినా రివిజన్ చేయలేక అపనమ్మకంతో పరీక్షలు రాస్తారు. ఫలితంగా నిరాశే ఎదురవుతుంది.
వ్యూహం అన్నింటికన్నా ప్రధానం
సాధించాలని అనుకున్న లక్ష్యం ఏదైనా, దానికి అన్నింటికన్నా ప్రధాన మైంది వ్యూహం. ముఖ్యంగా జీవితంలో స్థిరపడటానికి తోడ్పడే ప్రభుత్వ ఉద్యోగ సాధనకు అవసరమైన పోటీ పరీక్షలు రాయడానికి చక్కటి వ్యూహం చాలా అవసరం. చక్కటి వ్యూహం ప్రకారం ప్రిపరేషన్ ప్రారంభిస్తే ప్రయత్నంలో సగం విజయం సాధించినట్లే. కాబట్టి ప్రిపరేషన్ ప్రారంభించడానికి ముందు తగిన వ్యూహాన్ని రూపొందించుకోవడం చాలా అవసరం. వ్యూహం, ప్రణాళిక లేకుండా ప్రిపరేషన్ ప్రారంభిం చడం అనేది గమ్యం తెలియని ప్రయాణంలా మారుతుంది. ఏవిధంగా ప్రయాణిస్తే లక్ష్యాన్ని తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో చేరుకునే అవకాశముంటుందో అర్ధం చేసుకొని పాటించడమే వ్యూహం.
వ్యూహం ఎలా ఉండాలి?
పోటీపరీక్షల వ్యూహం ఎప్పుడూ పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే భర్తీచేసే పోస్టులు వందలు, వేలల్లో ఉంటే వాటికి పోటీపడే అభ్యర్ధులు లక్షల్లో ఉంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధించాలంటే తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసిన అవసర ముంటుంది. సాదాసీదా ప్రిపరేషన్‌తో, ప్రణాళికలేని ప్రిపరేషన్‌తో పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకోవడం అభిలషణీయం కాదు. కాబట్టి కొత్తగా పోటీపరీక్షలు రాయబోతున్నవారైనా, ఇప్పటికే పరీక్షలురాసిన వారైనా రాబోయే నోటిఫికేషన్లకి సమగ్ర వ్యూహం, ఆచరణయోగ్యమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇక ఈ వ్యూహంలో భాగంగా ఉండే వివిధ అంశాలు ఇవి..
1. రాయాల్సిన పరీక్షలపై స్పష్టత
2. పరీక్షల సిలబస్‌పై సమగ్ర అవగాహన
3. మెటీరియల్, రిఫరెన్స్ బుక్స్ సేకరణ
4. రోజువారీ ప్రణాళిక
5. ప్రాధాన్యం ఇవ్వాల్సిన సబ్జెక్టుల గుర్తింపు
6. రివిజన్, ప్రాక్టీస్ టెస్టులకు తగిన సమయం
7. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం
పైన పేర్కొన్నవన్నీ వ్యూహంలో భాగమే. వీటన్నింటిని పూర్తిగా పాటించి నపుడే అది సమగ్ర వ్యూహంగా నిలు స్తుంది. వీటిని వివరంగా పరిశీలిద్దాం.
1. రాయాల్సిన పరీక్షలపై స్పష్టత
నోటిఫికేషన్లు రాబోతున్నాయని తెలిసి ప్రిపరేషన్ ప్రారంభించినా రాబోయే నోటిఫికేషన్లలో ఏయే పోస్టులు ఉంటాయి. వాటిలో ఏ పరీక్షలు రాయడం ఉత్తమం అనే విషయం తెలుసుకోవడం కూడా అవసరమే. అభ్యర్ధుల అర్హతలు, సామర్ధ్యాలు, పోస్టుల సంఖ్య, పరీక్షా విధానం ఇలా అన్నీ విశ్లేషించి ఫైనల్‌గా ఏ పోస్టులకు ప్రిపేర్ కావాలో నిర్ణయించు కోవాలి. ఇలాంటి విశ్లేషణ వలన లక్ష్యం సాధించడంలో సరైన దిశలో అడుగులు వేసినట్లవుతుంది.
2. సిలబస్‌పై సమగ్ర అవగాహన
ఏ పోస్టులకు పోటీపడాలో, ఏ పరీక్షలు రాయాలో నిర్ణయించుకున్న తర్వాత, ఆ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌లను సమగ్రంగా పరిశీలించాలి. సాధారణంగా ఎపిపియస్‌సి నిర్వహించే పరీక్షలన్నింటిలో జనరల్ స్టడీస్ పేపర్ కామన్‌గా ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ సిలబస్ అన్ని పరీక్షలకు చాలా వరకు ఒకేలా ఉన్నా చిన్నచిన్న తేడాలు కూడా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించి అందుకు అనుగుణంగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశముం టుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనరల్ స్టడీస్ సిలబస్‌లో మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు నోటిఫికే షన్లలో ఉంటాయి. కాబట్టి అటువంటి మార్పులు జరిగితే వాటికి తగినట్లు ప్రిపరేషన్ మార్చుకోవాలి.
3. మెటీరియల్, రిఫరెన్స్ బుక్స్ సేకరణ
ఒకసారి రాయబోయే పరీక్షలు, సిలబస్‌పై అవగాహన వచ్చిన తరువాత వెంటనే చేయవలసింది ప్రిపరేషన్‌కు అవసర మైన మెటీరియల్, రిఫరెన్స్ బుక్స్ సేకరణ. ఈ సేకరణలో సీనియర్లు, ఆయా విభాగాల అధ్యాపకుల గైడెన్స్ చాలా ఉపయోగ పడుతుంది. వీరి సలహాలు తప్పక తీసుకోవాలి. ఎందుకంటే అనవసరమైన మెటీరియల్, పుస్తకాలతో విలువైన కాలం వృధా అవుతుంది. మార్కెట్లో విడుదల అయ్యే ప్రతి పుస్తకాన్ని సేకరించ కుండా ప్రామాణికమైన వాటినే సేకరించడం వ్యూహంలో మరో ప్రధానమైన అంశం.
4. రోజువారీ ప్రణాళిక
ఇక వ్యూహంలో అత్యంత ప్రధానమైన అంకం చదవడం. అంటే దీనితోనే వాస్తవంగా ప్రిపరేషన్‌లోకి అడుగు పెట్టినట్లవు తుంది. ఉన్న సమయాన్ని సబ్జెక్టులవారీగా ఉదయం, సాయం త్రం, రాత్రి కేటాయించుకొని చదవాలి. ఇతర వ్యాపకాలకు అవసరమయ్యే సమయాన్ని మినహా యించి మిగిలిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం అయ్యేటట్లు చూసుకోవాలి. ఏదో ఒక జాబ్ చేస్తున్నవారైనా, ఖాళీగా ఉన్నవారైనా కనీసం రోజుకు 6 నుంచి 8 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించడం అవసరం. రోజువారీ ప్రిపరేషన్ ప్రణాళిక ఎట్టి పరిస్థితులలోనూ పాటించేటట్లు చూసుకుంటే అనుకున్న విధంగా సిలబస్ పూర్తవుతుంది. మెజార్టీ అభ్యర్ధులు ఈ విషయంలోనే కొంచెం అజాగ్రత్తగా ఉండి ప్రణాళికను పాటించడంలో విఫలమవుతుంటారు.
5. ప్రాధాన్య సబ్జెక్టుల గుర్తింపు
సాధారణంగా పోటీపరీక్షలలో ఉండే అన్ని అంశాల్లో అందరూ నిష్ణాతులు కాలేరు. ఒక్కొక్కరికి ఒక్కో అంశంలో పట్టు ఉంటుంది. మిగతా అంశాల్లో పూర్తి అవగాహన ఉండదు. అభ్యర్ధులు ఇక్కడ వ్యూహాత్మకంగా నడచుకోవాలి. ఏయే అంశాలు తాము కష్టంగా భావిస్తున్నారో, ఏ అంశాలపై అవగాహన లేదని అనుకుంటున్నారో వాటికి అన్నింటికన్నా ప్రధమ ప్రాధాన్యం ఇచ్చి ప్రిపేర్ కావాలి. కష్టమైన వాటిని ముందుగా చదవడం సరైన పద్ధతి. లేదంటే కష్టమైన అంశాలు చివరివరకూ అలాగే ఉండిపోయి సమయం సరిపోక పరీక్షల్లో ఆ అంశాలకు సంబంధించి తక్కువ మార్కులు రావడం జరుగుతుంది. ఉదాహరణకు జనరల్‌స్టడీస్ పేపర్‌లో మెంటల్ ఎబిలిటీ విభాగం కష్టంగా భావించి చాలా మంది అభ్యర్ధులు ప్రిపేర్ కారు. కానీ ఈ విభాగాన్ని రెగ్యులర్‌గా రోజూ ప్రాక్టీస్ చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎకానమీలో భాగంగా ఇటీవల అనేక ప్రధానమైన అంశాలు ప్రముఖంగా ప్రతిరోజూ వార్తాపత్రి కలలో వస్తున్నాయి. రూపాయి పతనం, కరెంట్ అకౌంట్ డెఫి సిట్, గార్ నిబంధనలు, జిడిపి ఇలాంటి అంశాలను సమగ్రంగా అర్ధంచేసుకోవ డానికి ప్రయత్నించాలి. సంక్లిష్టమైనవని వీటిని వదిలేస్తే ఆ మేరకు ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముంది.
6. రివిజన్, ప్రాక్టీస్ టెస్టులు
ప్రిపరేషన్‌లో భాగంగా మధ్యలో రివిజన్ చేసుకోవడం, ప్రాక్టీస్ టెస్టులు రాయడం చేస్తే అప్పటివరకు చదివింది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ప్రిపరేషన్‌లోని లోపాలు అర్ధమవు తాయి. వాటిని సరిదిద్దుకోవడానికి సమయం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇవి కూడా తమ ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్ధులు పాటించాలి. పోటీపరీక్షల ప్రిపరేషన్‌లో ఏ విషయాన్నీ తేలికగా తీసుకోకుండా అన్నింటికీ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే విజయం సాధ్యమవుతుంది.
7. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం
పోటీపరీక్షలలో విజయం సాధించడానికి ప్రారంభం నుంచి చివరి వరకూ ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించాలి. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకంతో ప్రతి దశలోనూ ముందుకు అడుగువేయాలి. అనుకోని కారణాలవలన నోటిఫికేషన్లు లేటయినా, పరీక్షలు ఆలస్యంగా జరిగినా నిరుత్సాహపడకుండా దీర్ఘకాలం అయినా సరే ప్రిపరేషన్ కొనసాగించి అన్నివేళలా సంసిద్ధులై ఉండాలి. ఆత్మవిశ్వాసం అదనపు బలంగా, ప్రత్యేకతగా మార్చుకోగలిగితే పోటీపరీక్షల్లో విజయం లభించి కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం సొంతమవుతుంది.
No comments:
Post a Comment
Google Sign-in enabled to reduce spam...