జ ః గ్రూప్-1 ప్రిలిమినరీ క్వాలిఫై కావాలంటే నిర్ధిష్టంగా ఇన్ని మార్కులు రావాలన్న నిబంధన లేదు. ఇది ప్రతిసారీ మారుతుంటుంది కూడా, ప్రశ్నాపత్రం కఠినత్వం, సరళత్వం, క్లిష్టత, పోటీ తీవ్రత వంటి అనేక అంశాలు కటాఫ్ మార్కుల బెంచ్ మార్క్‌ను నిర్ణయి స్తాయి. అందువల్ల సాధ్యమయినంత వరకు అత్యధిక స్కోర్ సాధించడానికి కృషి చేయడమే ఉత్తమం.రాష్ర్టంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలైన గ్రూప్-1 సర్వీసు లలో చేరాలంటే దీర్ఘకాలం ప్రిపరేషన్‌తో, పట్టుదలతో నిరంతరం కష్టపడటం తప్పనిసరి. గ్రూప్-1 పరీక్ష మూడంచెల్లో జరుగు తుంది. ఇందులో మొదటిది ప్రిలిమినరీ కేవలం వడపోత (ఫిల్టర్) పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కులు ఫైనల్ ర్యాంకింగ్‌లో కలుపబడవు. అయితే ఇది అత్యంత కఠినమైనదని గుర్తించాలి. ఎందుకంటే మెయిన్స్ సబ్జెక్ట్‌ల్లో ఎంత పట్టు ఉన్నా ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు పొందే సామర్ధ్యం ఉన్నప్పటికీ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాకపోతే గ్రూప్-1లోకి ప్రవేశించే అవకాశం ఉండదని గమనించాలి.2008 వరకు ప్రిలిమినరీలో క్యాటగిరీ వైజ్ కటాఫ్ ఉండేది. అయితే 2008లో సుప్రీంకోర్టు ఈ విషయంలో సంచనాత్మకమైన తీర్పును ఇవ్వడం జరిగింది.
క్యాటగిరీతో సంబంధం లేకుండా కామన్ మెరిట్ ప్రాతిపదికన 1:50 చొప్పున మెయిన్స్‌కు క్వాలిఫై చేయాలని పేర్కొనడం జరిగింది. నిజానికి రిజర్వేషన్ క్యాటగిరి అభ్యర్ధులు వారికి కేటాయించిన రోస్టర్ పోస్టుల ఇంటర్వ్యూకి అవసరమైన 1:2 నిష్పత్తిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్ధులను మెయిన్స్‌కు క్వాలిఫై చేస్తే సరిపోతుందని భావించిన కోర్టు ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. అయితే గత ఫలితాలను చూస్తే రిజర్వేషన్ క్యాటగిరికి చెందిన అభ్యర్ధులు ఓపెన్ క్యాటగిరిలో అత్యధిక సంఖ్యలో ఉండటం వల్ల సహజంగానే ప్రిలిమినరీ విషయంలో రిజర్వేషన్ ప్రస్తావన కనుమరుగయ్యింది. 2011 గ్రూప్-1 ప్రిలిమినరీ కామన్ కటాఫ్ 92 వరకు ఉండటాన్ని ప్రిలిమ్స్ విషయంలో మరింత సీరియస్‌గా ఉండాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుస్తున్నది.
No comments:
Post a Comment
Google Sign-in enabled to reduce spam...