1. సరైన ప్రణాళిక
2. అమలు ఈ రెండింటిలో స్పష్టత ఉన్నవాళ్లు విజేతలుగా నిలుస్తారు.
సమయంతో పోటీ
బ్యాంక్ పరీక్షకు సిద్ధం అయ్యేవాళ్లు కాలంతో పోటీ పడాలి. ప్రిపరేషన్‌లో, అలాగే పరీక్ష రాయడంలోనూ ఇది వర్తిస్తుంది. పరీక్షలో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి. రెండు వందల ప్రశ్నలు ఇస్తారు. ఇందుకుగాను కేటాయించిన సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు. అంటే 150 నిమిషాల్లో 200 ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ప్రశ్నకు అందుబాటులో ఉన్న సమయం 45 సెకన్లు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో ప్రశ్న చదివి, అర్థం చేసుకొని, దానికి జవాబు కనుగొనాలి. సిలబస్‌లో పేర్కొన్న వివిధ విభాగాల్లో ప్రశ్నల కఠినస్థాయి ఆధారంగా ప్రణాళిక ఉంటే మంచిది.
సిలబస్ ఒకటే
ఆఫీసర్, క్లర్క్ పోస్టులకు ఒకే తరహా సిలబస్‌ను ఇచ్చారు. అయితే ప్రశ్నల కఠిన స్థాయిలో మాత్రం కచ్చితంగా భిన్నత్వం ఉంటుంది. ఆఫీసర్ పోస్టుల్లో ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. అయితే చాలామంది అభ్యర్థులు ఏది ప్రిపేర్ కావాలో తెలియక గందరగోళానికి గురవుతారు. అభ్యర్థులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్స్‌పై పూర్తిస్థాయిలో పట్టు ఉంటే, ఎంత కఠినంగా ఉన్న ప్రశ్న అయినా సరే తేలికగా సమాధానం కనుక్కోవొచ్చు. విభాగాల వారీగా ప్రిపరేషన్ తీరును పరిశీలిస్తే.....
రీజనింగ్
ఇందులో క్లరికల్ పరీక్షలో ప్రశ్నలు వచ్చే అంశాలు- ఆల్ఫాబెట్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్-డీకోడింగ్, డైరెక్షన్స్, సీటింగ్ అరెంజ్‌మెంట్, ఫజిల్స్, కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్, సిలాజిసం, ఇన్‌పుట్ ఔట్‌పుట్... అదే ఆఫీసర్ల పరీక్షకు ఈ అధ్యాయాలతో పాటు అదనంగా స్టేట్‌మెంట్స్ కన్‌క్లూజన్స్, కాస్ అండ్ ఎఫెక్ట్, కోర్స్ ఆఫ్ యాక్షన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు రావొచ్చు. ముందుగా వివిధ అంశాలు, అందులో షార్ట్‌కట్స్ గురించి బాగా తెలుసుకోవాలి.
అలాగే ఒక అంశంలో తెలుసుకున్న లాజిక్ ఇంకో దానిలో ఎలా ఉపయోగపడుతుందో కూడా నేర్చుకోవాలి. ఉదాహరణకు ఆల్ఫాబెట్ పరీక్షలో ఉపయోగించే లాజిక్, ర్యాంకింగ్ అధ్యాయానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే కోడెడ్ బ్లడ్ రిలేషన్స్‌లో నేర్చుకునే కొన్ని అంశాలు కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్‌లో కూడా ఉపయోగపడుతాయి. అలాగే ఆఫీసర్ల పోస్టులకు వచ్చే స్టేట్‌మెంట్స్ అసంప్షన్స్, ఇన్ఫరెన్సెస్ అధ్యాయాలకు ఒకే తరహా లాజిక్ అవసరం అవుతుంది. ఇలా సారూప్యాలు ఉన్నవాటిని ఎంచుకొని సిద్ధం అయితే ప్రిపరేషన్‌కు చాలా తక్కువ సమయంలో పూర్తిచేయవచ్చు. కేవలం కాన్సెప్ట్స్ నేర్చుకున్నంత మాత్రన సరిపోదు. సాధ్యం అయినన్ని ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
జనరల్ అవెర్‌నెస్:
చాలా తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసుకోగల విభాగం ఇది. పరీక్షకు గడిచిన ఆరు నెలలకు ముందు జరిగిన వివిధ సంఘటనలను అడుగుతున్నారు. తాజా పరిణామాలకు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్స్‌పై ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షలో కుశ్వంత్ సింగ్ రాసిన చివరి పుస్తకం ఏదీ? అంటూ అడిగారు. దీనికి కారణం, ఇటీవలి పరిణామానికి ఇది బ్యాగ్రౌండ్, ప్రముఖ రచయిత అయిన కుశ్వంత్ ఈ ఏడాది మార్చి 20న మతి చెందారు.
అలాగే దాదాపుగా ప్రశ్నలన్నీ తాజా సంఘటనలు, లేదా వాటి తాలూకు బ్యాగ్రౌండ్స్‌పై ఉంటాయి. ముఖ్య ఈవెంట్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇప్పటి నుంచి జరిగే కీలక పరిణామాలను గుర్తించి మంచి స్కోర్ చేయవచ్చు. ఎన్‌డీఏ ప్రభుత్వం తన కొత్త బడ్జెట్‌ను జూలైలో ప్రవేశపెట్టబోతోంది, వీటికి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. అలాగే ఫిఫా ప్రపంచకప్ జూలైలో ముగుస్తుంది. ఇందులో విజేతలు, ప్రత్యేక విశేషాలను తెలుసుకోవాలి. ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులు, ప్రదేశాలు, ఆర్థిక, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలను తెలుసుకోవాలి.
అలాగే అంతర్జాతీయ పరిణామాలు (ఇరాక్, ఉక్రేయిన్, సిరియా, ఈజిప్ట్) పరిణామాలు, వార్తల్లో నిలిచిన దేశాల రాజధానులు, వాటి కరెన్సీలు, ఇటీవలి కాలంలో జరిగిన వివిధ దేశాల ఎన్నికలు, కొత్తగా ఎన్నికైన వారు.... ఇలా అన్ని గుర్తుంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్ అన్నది సముద్రం లాంటిది. అయితే అందులో అవసరం అయినవి ఎంపిక చేసుకొని సిద్ధం అయితేనే పట్టు సాధించవచ్చు. పూర్వ ప్రశ్న పత్రాలను పరిశీలించి ప్రశ్న కోణాలను ఎంచుకోవాలి. - రాజేంద్రశర్మ. వి(హెడ్ ఆఫ్ ది అకడమిక్స్)
అరిథ్‌మెటిక్‌కు సిద్ధమవ్వండిలా:
నంబర్ సిస్టమ్ కీలకం. క్లరికల్ పరీక్షలకు దాదాపుగా 25 ప్రశ్నలు వస్తాయి. అఫీసర్ల పరీక్షలో సుమారుగా 10 నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. అయితే అరిథ్‌మెటిక్ విభాగంలోని ఇతర ప్రశ్నలకు కూడా సమాధానాలు కనుగొనాలంటే, నంబర్ సిస్టమ్‌లో నేర్చుకున్న అంశాలే ఉపయోగపడుతాయి. చాలామంది అభ్యర్థులు షార్ట్‌కట్స్‌పై ఆధారపడుతారు. అయితే ఇందులో లాజిక్ కీలకం. లాజిక్‌తోపాటు షార్ట్‌కట్స్ నేర్చుకుంటేనే అభ్యర్థులు మంచి స్కోర్ చేయగలుగుతారు. ఉదాహరణకు ...
10 మంది ఒక పనిని 20 రోజుల్లో చేయగలరు, అదే 20 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? అని అడిగారు అనుకుందాం. సమాధానం 10. ఇందులో గణించాల్సిన అంశాలు ఏం లేవు, కేవలం లాజిక్ ఆధారంగా సమాధానం కనుగొనవచ్చు. ఇక్కడ తొలి సందర్భంలో 10 మంది ఉన్నారు, తర్వాత వీరి సంఖ్య రెట్టింపు అయింది, కాబట్టి కావాల్సిన సమయం కచ్చితంగా సగం అవుతుంది. ఆ విధంగా సమాధానాలు కనుగొనాలంటే బేసిక్స్‌పై పూర్తిస్థాయి పట్టు అవసరం.
ఆఫీసర్ల పరీక్షలో దత్తాంశాలు (డాటా ఇంటర్‌ప్రిటేషన్)పై నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఇందులో స్కోర్ చేయాలంటే నంబర్ సిస్టమ్‌పై పూర్తి స్థాయిలో పట్టు ఉండాలి. అలాగే నిష్పత్తులు, శాతాలు, సరాసరి తదితర అంశాలకు సంబంధించిన అవగాహన అవసరం. మిగతా అరిథ్‌మెటిక్ అంశాలను పరిశీలిస్తే పని కాలం, దూరం-కాలం, సరళ, చక్ర వడ్డీలు, భాగస్వామ్యం, లాభ నష్టాలు.... తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- జి. విరేందర్(ఫ్యాకల్టీ, అరిథ్‌మెటిక్)
ఇంగ్లీష్‌పై పట్టు తప్పనిసరి:
చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్‌లో వెనకబడి ఉంటారు. పరిజ్ఞానం పెంచుకోవడంతో పాటు, వేగం కూడా ఉండాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్, ప్యారాజంబుల్స్, స్పాటింగ్ ఎర్రర్స్, క్లోజ్‌టెస్ట్, సినానియమ్స్-ఆంటోనియమ్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. గ్రామర్‌పై స్పష్టమైన పరిజ్ఞానంతో పాటు సందర్భోచితంగా ఇంగ్లీష్‌ను అర్థం చేసుకొనే సామర్ధ్యం ఉండాలి.
రీడింగ్ కాంప్రెహెన్షన్‌కు సిద్ధం కావాలంటే నిత్యం ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలోని సంపాదకీయాన్ని చదవాల్సి ఉంటుంది. సెంటెన్స్ కరెక్షన్‌కు సంబంధించి గ్రామర్‌పై పట్టు అవసరం. టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ప్యారలల్ స్ట్రక్చర్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో నేర్చుకునే పరిజ్ఞానమే ప్యారాజంబుల్స్‌లోనూ ఉపయోగపడుతుంది. క్టోజ్ టెస్ట్‌కు సందర్భోచితంగా పదాలను అర్థం చేసుకొనే సామర్ధ్య ఉండాలి.
నేహా(ఇంగ్లీష్ ఫ్యాకల్టీ)
కంప్యూటర్స్: కంప్యూటర్స్ విభాగానికిగాను 40 ప్రశ్నలకు కేటాయించిన మార్కులు 20. అంటే ప్రతిప్రశ్నకు అర మార్కు. జాగ్రత్తగా సిద్ధం అయితే, ఈ విభాగం స్కోరింగ్ పెంచుకోడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో లాజిక్ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. సూత్రాలు ఉండవు. సుమారుగా ఉన్న అధ్యాయాలు 12. కంప్యూటర్ బేసిక్స్, చరిత్ర (కంప్యూటర్‌కు సంబంధించి), ఎంఎస్-ఆఫీస్ (ఇందులో ఫంక్షనాలిటీ, షార్ట్‌కట్ కీ, ఉపయోగించే విధానంపై అవగాహన), ఆపరేటింగ్ సిస్టమ్‌లో (సిస్టమ్ పనితీరు, సెక్యూరిటీ ఇచ్చే విధానం, సీపీయూను ప్రభావవంతంగా వాడుకొనే తీరు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి) చాలా ఉన్నప్పటికీ విండోస్‌పైనే ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నారు. కంప్యూటర్ పెరిఫెరల్స్ అంటే కంప్యూటర్‌కి అదనంగా తగిలించే డివైసెస్, వాటికి సంబంధించి రెండు నుంచి మూడు ప్రశ్నలు వస్తున్నాయి.
ఇందులో ముఖ్యంగా ఇన్‌పుట్/ఔట్‌పుట్ పరికరాలను గురించి అడుగుతారు. కంప్యూటర్ సెక్యూరిటీకి సంబంధించి వైరస్, హ్యాకింగ్, స్పామ్ తదితర అంశాల గురించి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అధ్యాయాల్లో ఒకటి DBMS ఇందులో కనీసం అయిదు ప్రశ్నల వరకు రావొచ్చు. అసలు డాటాబేస్ అంటే ఏంటీ? అందులో డాటాను ఎలా పొందుపరుస్తారనే కోణంలో ప్రశ్నిస్తారు. నెట్‌వర్క్ అనేది మరో కీలకాంశం. ఇందులో ప్రాథమిక అంశాల నుంచి అడ్వాన్స్‌డ్ స్థాయి వరకు ప్రశ్నలు వస్తాయి. ప్రాథమిక అంశాలకు సంబంధించి LAN, ఇంటర్నెట్, ఫైర్‌వాల్ TCP/IP, వైర్‌డ్ నెట్ వర్కింగ్, వైర్‌లెస్ నెట్ వర్కింగ్, ప్రొటోకాల్స్, OSI, టొపాలజీ తదితర అంశాల నుంచి అయిదు లేదా ఆరు ప్రశ్నలు రావొచ్చు.
-సమయ కేటాయింపుల్లో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్నింటికంటే కష్టమైన విభాగానికి ఎక్కువ, సులభం అయిన వాటికి తక్కువ సమయం కేటాయించాలి.
-సాధారణంగా అరిథ్‌మెటిక్ విభాగాన్ని చాలా మంది కష్టంగా భావిస్తారు, 150 నిమిషాల్లో 40 నుంచి 50 నిమిషాలు, రీజనింగ్‌కు 40 నుంచి 50 నిమిషాలు, అలాగే ఇంగ్లీష్‌కు 25, మిగతా రెండు విభాగాలకు 25 నిమిషాలు కేటాయించడం మంచిది
-బ్యాంకింగ్ నాలెడ్జ్‌కు సంబంధించి ఒక సాధారణ వ్యక్తికి బ్యాంకింగ్ పరిజ్ఞానం ఎంత మేరకు అవసరం ఉంటుంది లాంటి ప్రశ్నలు వస్తున్నాయి, అలాగే ఆర్‌బీఐ ద్రవ్య విధానం, ద్రవ్య కట్టడికి ఆర్‌బీఐ తీసుకునే చర్యలు, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్, వివిధ బ్యాంక్ అకౌంట్లు, ఎన్‌పీఏలు తదితర అంశాలను అడుగుతున్నారు.
-ఇటీవలి కాలంలో బ్యాంకింగ్‌లో పలు ముఖ్య కమిటీలు ఉన్నాయి- బిమల్ జలాన్, ఉర్జిత్ పటేల్, నాయక్ తదితర కమిటీ సిఫారసుల నుంచి ప్రశ్నలు రావొచ్చు.
-ఎఫ్‌డీఐలకు సంబంధించి మాయారం కమిటీ సిఫారసులను ఇటీవలే ప్రభుత్వం ఆమోదించింది, వీటికి సంబంధించిన అంశాలు కీలకం.
ఎస్‌బీఐ క్లరికల్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి?బ్యాంకు పరీక్షల్లో విజయ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించే అంశం వేగం. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. వాటి సాధనకు అన్వయ సామర్థ్యం అవసరం. మరోవైపు అందుబాటులోని సమయం కూడా పరిమితమే. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో గణిత సంబంధ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలంటే అంచెలవారీగా (స్టెప్‌వైజ్) నిర్దిష్ట సమస్యను పరిష్కరిస్తూ సాగాలి.
అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ విభాగంలోని ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే వేగంగా చదవడం; కీలక పదాలను గుర్తించడం; ప్యాసేజ్ కింద అడిగిన ప్రశ్నను చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన సమాధానం ప్యాసేజ్‌లో ఎక్కడ ఉందో జ్ఞప్తికి తెచ్చుకోవడం వంటి నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. వీటన్నిటికీ కావాల్సింది నిరంతర ప్రాక్టీస్. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలించాలి.
అంతేకాకుండా ప్రతి చాప్టర్ పూర్తయ్యాక స్వీయ సమయ పరిమితి విధించుకుని సెల్ఫ్ టెస్ట్ రాయాలి. తొలి దశలో తెలిసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అవి ఎంత సమయంలో పూర్తయ్యాయో గుర్తించాలి. అక్కడితో ఆగకుండా తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇలా.. రెండు దశల్లో సెల్ఫ్ టెస్ట్ పూర్తి చేసుకుని నిరాటంకంగా ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు? ఎన్ని ప్రశ్నల్లో దోషాలు తలెత్తాయి? అన్నది విశ్లేషించుకోవాలి. సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు పరీక్ష కోణంలో ముఖ్యమైనవా? కావా? అని పరిశీలించాలి. ఇందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి. ఆ చాప్టర్‌లోని అంశాలకు లభిస్తున్న వెయిటేజీని గుర్తించి దానికనుగుణంగా సన్నద్ధం కావాలి. వెయిటేజీ ఎక్కువగా ఉండి, కష్టంగా ఉన్న టాపిక్స్‌కు శిక్షణ తీసుకోవడానికి వెనుకాడొద్దు.
ఎస్‌బీఐ క్లరికల్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి?బ్యాంకు పరీక్షల్లో విజయ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించే అంశం వేగం. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. వాటి సాధనకు అన్వయ సామర్థ్యం అవసరం. మరోవైపు అందుబాటులోని సమయం కూడా పరిమితమే. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో గణిత సంబంధ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలంటే అంచెలవారీగా (స్టెప్‌వైజ్) నిర్దిష్ట సమస్యను పరిష్కరిస్తూ సాగాలి.
అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ విభాగంలోని ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే వేగంగా చదవడం; కీలక పదాలను గుర్తించడం; ప్యాసేజ్ కింద అడిగిన ప్రశ్నను చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన సమాధానం ప్యాసేజ్‌లో ఎక్కడ ఉందో జ్ఞప్తికి తెచ్చుకోవడం వంటి నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. వీటన్నిటికీ కావాల్సింది నిరంతర ప్రాక్టీస్. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలించాలి.
అంతేకాకుండా ప్రతి చాప్టర్ పూర్తయ్యాక స్వీయ సమయ పరిమితి విధించుకుని సెల్ఫ్ టెస్ట్ రాయాలి. తొలి దశలో తెలిసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అవి ఎంత సమయంలో పూర్తయ్యాయో గుర్తించాలి. అక్కడితో ఆగకుండా తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇలా.. రెండు దశల్లో సెల్ఫ్ టెస్ట్ పూర్తి చేసుకుని నిరాటంకంగా ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు? ఎన్ని ప్రశ్నల్లో దోషాలు తలెత్తాయి? అన్నది విశ్లేషించుకోవాలి. సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు పరీక్ష కోణంలో ముఖ్యమైనవా? కావా? అని పరిశీలించాలి. ఇందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి. ఆ చాప్టర్‌లోని అంశాలకు లభిస్తున్న వెయిటేజీని గుర్తించి దానికనుగుణంగా సన్నద్ధం కావాలి. వెయిటేజీ ఎక్కువగా ఉండి, కష్టంగా ఉన్న టాపిక్స్‌కు శిక్షణ తీసుకోవడానికి వెనుకాడొద్దు.
No comments:
Post a Comment
Google Sign-in enabled to reduce spam...