Pages

Mobile Ad

November 27, 2014

Amendment of Constitution (TM)

ఆధునిక కాలంలో రాజ్యాంగ సవరణ విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశకాల పరిస్థితులు మార్పుచెందుతున్నపుడు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరించే విధంగా రాజ్యాంగం ఉండాలి. దీనిని గ్రమించిన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సవరణ విధానాన్ని కల్పించారు. దీనిని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. 

రాజ్యాంగంలోని 20వ భాగంలో ప్రకరణ 368 లో రాజ్యాంగ సవరణ పద్ధతిని పొందుపరిచారు. దీనికోసం రాజ్యాంగ ప్రకరణలను మూడు వర్గాలుగా విభజించి, మూడు ప్రత్యేక పద్దతులను నిర్దేశించారు. అవి:
1. పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి (సింపుల్ మెజారిటీ)
2. ప్రత్యేక మెజారిటీ ద్వారా జరిగే సవరణ (స్పెషల్ మెజారిటీ)
3. పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ర్టాల శాసనసభల ఆమోదం 
(స్టేట్ స్యాటిస్‌ఫ్యాక్షన్) ద్వారా జరిగే సవరణ సింపుల్ మెజారిటీ


సాధారణ మెజారిటీ ద్వారా కొన్ని ప్రకరణలను పార్లమెంట్ సవరిస్తుంది. సాధారణ చట్టాన్ని పార్లమెంటు ఏ విధంగా సవరిస్తుందో అదే పద్ధతిలో రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలను సవరించవచ్చు. అయితే సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణలను రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు. సాధారణ మెజారిటీ గురించి 368వ ప్రకరణలో ప్రస్తావించలేదు. అందులో ప్రస్తావించిన అంశాలు రాజ్యాంగ సవరణ పరిధిలోకి రావు. 

ప్రకరణ 368లోని అంశాలు

- కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేయడం, రాష్ర్టాల పేర్లు, సరిహద్దుల మార్పు పకరణలు 1-4)
- రాష్ట్ర ఎగువసభ విధాన పరిషత్ ఏర్పాటు, రద్దు పకరణ 169)
- భారత పౌరసత్వంలో మార్పులు పకరణలు 5-11)
- పార్లమెంటులో కోరం పకరణ 100)
- రెండో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న రాజ్యాంగ పదవుల జీతభత్యా లుపకరణలు 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186, 221)
- పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియలు, శాసన సభ్యుల సాధికారాలు పకరణలు 105, 194)
- సుప్రీంకోర్టు పరిధికి సంబంధించిన అంశాలు పకరణ 139)
- కేంద్రపాలిత ప్రాంతాలలో శాసన మండలి, శాసనసభ ఏ ర్పాటు పకరణ 239)
- నియోజకవర్గాల పునర్‌విభజన పకరణ 82)
- పార్లమెంట్‌లో ఉపయోగించే భాష పకరణ 120)
- ఐదో షెడ్యూల్, ఆరో షెడ్యూల్‌ల్లో పేర్కొన్న అంశాలు
- సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు సంఖ్య నిర్ణయించడం పకరణ 124) 
- సాధారణ మెజారిటీ అంటే హాజరై, ఓటేసిన వారిలో సగానికంటే ఎక్కువ ఉండాలి
- రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలనే నియమాన్ని 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

స్పెషల్ మెజారిటీ 
ప్రకరణ 368లో పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ ద్వారా జరిగే పద్ధతిని వివరించారు. రాజ్యాంగంలో అత్యధిక భాగాలను ఈ పద్ధతిని అనుసరించే సవరిస్తున్నారు. పార్లమెంటు ఉభయసభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు మెజారిటీని సాధించాలి. స్పెషల్ మెజారిటీ ద్వారా సవరించే అంశాలు.
- రాష్ట్రపతి ఎన్నిక విధానం పకరణ (54, 55)
- కేంద్ర కార్యనిర్వాహక పరిధిని విస్తతం చేయడం పకరణ 73)
- రాష్ట్ర కార్యనిర్వాహక పరిధిని విస్తతి చేయడం పకరణ 162)
- కేంద్ర, రాష్ర్టాల మధ్య శాసనపరమైన అధికారాల విభజన పకరణ 246) 
- రాష్ర్టాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పకరణ 80, 81)
- ఏడో షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలు
- రాజ్యాంగ సవరణ పద్ధతి పకరణ 368)

రాజ్యాంగ సవరణ విధానం..
ప్రకరణ 368లో రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియ నియమాలను పేర్కొన్నారు.
- రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు. రాష్ట్ర శాసనసభలకు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించే అధికారం లేదు.
- రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రి గానీ, సాధారణ సభ్యుడు గానీ ప్రతిపాదించవచ్చు.
- రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.
- రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయసభల చేత నిర్ణీత మెజారిటీ ప్రకారం వేర్వేరుగా ఆమోదించాలి. ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరిస్తే.. ప్రతిష్టంభన తొలగించడానికి సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. కాబట్టి బిల్లు వీగిపోతుంది.
- సమాఖ్య అంశాలకు సంబంధించిన ప్రకరణలు సవరించడానికి సగానికిపైగా రాష్ట్ర శాసనసభలు కూడా తమ ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది.
- పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోద ముద్రకు పంపుతారు. దానికి రాష్ట్రపతి తప్పనిసరిగా తన ఆమోదాన్ని తెలపాలి. తిరస్కరించడం గానీ, పునఃపరిశీలనకు గానీ అవకాశం లేదు. 
- రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది. చట్టం అముల్లోకి వచ్చిన రోజు నుంచి రాజ్యాంగాన్ని సవరించినట్లుగా పరిగణిస్తారు.
- రాజ్యాంగసవరణ ప్రక్రియ స్వయం నిర్దేశిత పద్ధతి (Self contained procedure). ప్రకరణలో పేర్కొన్నదానికి, సాధారణ చట్ట సవరణ పద్ధతికి పోలికలేదు.
- రాజ్యాంగ సవరణ న్యాయసమీక్షకు గురవుతుంది.

రాజ్యాంగ సవరణపై విమర్శ
రాజ్యాంగ సవరణలో అనేక లోపాలున్నాయనే విమర్శలున్నాయి.
-రాజ్యాంగ సవరణకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు/ సభ లేకపోవడం
- సవరించే అధికారాన్ని పార్లమెంటుకే పరిమితం చేయడం
- రాష్ర్టాలకు రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించే అధికారం లేదు. అయితే అమెరికాలోని రాష్ర్టాలకు ఈ అధికారం ఉంది.
- రాజ్యాంగ సరవణలో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే పరిష్కారానికి సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు.
- రాజ్యాంగంలోని చాలా భాగాలు పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించడం (రాష్ర్టాల భాగస్వామ్యం అతి తక్కువగా ఉండటం)
- రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ర్టాల ఆమోదంలో జాప్యం జరగవచ్చు. దీనికి కారణం రాష్ర్టాలు నిర్ణీత సమయంలోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించాల్సిన అవసరం లేదు.
- రాజ్యాంగంలోని కొన్ని భాగాలను సాధారణ చట్టాన్ని సవరించే పద్ధతిలోనే సవరించవచ్చు. అందువల్ల రాజ్యాంగ పవిత్రత దెబ్బతింటుంది. 

Also Read:

No comments:

Post a Comment

Google Sign-in enabled to reduce spam...

Mobile Ad2