Pages

Mobile Ad

February 4, 2014

గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అని రెండు క్యాటగిరీలు ఉన్నాయి అని విన్నాను. అయితే వీటి అర్ధం ఏమిటి?

ఎపిపిఎస్‌సి నిర్వహించే రిక్రూట్‌మెంట్లలో గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అని రెండు క్యాటగిరీలు ఉన్నాయి అని విన్నాను. అయితే వీటి అర్ధం ఏమిటి? ఈ జాబ్స్ విధి విధానాలు ఎలా ఉంటాయి? తెలియచేయగలరు?- కె. ప్రశాంతి, కరీంనగర్ .
జ ః ఎపిపిఎస్‌సి నిర్వహించే రిక్రూట్‌మెంట్లలలో గ్రూప్-1 అత్యున్నత సర్వీసులు కాగా గ్రూప్-2 రెండవ అత్యున్నత సర్వీసులు నిజానికి ప్రభుత్వ యంత్రాం గంలో ఫీల్డ్ లెవల్‌లో, యూనిట్ ఆఫీస్‌లలో గ్రూప్-2 ఉద్యోగులే క్రియాశీలపాత్ర పోషిస్తారు. అందువల్ల ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుందియగూప్-2 ఉద్యోగాలను వాటి విధులు, స్వభావం, అధికా రాలు, తదితర అంశాల ఆధారంగా ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాటగిరీలుగా విభజించడం జరిగింది. ప్రభుత్వ విధానాలను ప్రత్యక్షంగా అమలుచేసే (ఎగ్జిక్యూట్) వాటిని ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలని, ఈ ఉద్యోగులకు సహాయంగా ఉప యోగపడే వాటిని నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలని విభజించడం జరిగింది. ఈ రెండు రకాల ఉద్యోగాల జీతభత్యాలలో కూడా తేడా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ప్రవెూషన్ ద్వారా గ్రూప్-1లోకి ప్రవేశించడానికి ఫిడర్ పోస్టులుగా ఉంటాయి.
గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలలో డిప్యూటీ తహశిల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, కో-ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ వంటివి కీలకమైనవి. వీటిలో డిప్యూటీ తహశిల్దార్‌గా ఎస్.సి, ఎస్.టి, రిజర్వేషన్ గల అభ్యర్ధులు సగటున 25 సంవత్సరాల వయస్సులో ప్రవేశిస్తే 50 సంవత్సరాల నాటికి జాయింట్ కలెక్టర్ స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉంది. ఇలాంటి సువర్ణావకాశం ఉన్నందున ఈ పోస్టులకు పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలలో సెక్రటేరియట్‌లో అసి స్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ట్రెజరీ, ఆడిట్ విభాగాలలో అకౌంటెంట్స్, ఆడిటర్స్, ఎపిపిఎస్‌సి వంటి విభాగాలలో జూనియర్ అసిస్టెంట్స్ వంటివి కీలకమైనవి. వీటిలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యో గంలో ప్రవేశించిన వారు అడిషనల్ సెక్రటరీ స్థాయికి చేరుకొనే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వీటిలోని కొన్ని క్యాటగిరీలు ప్రవెూషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులలోకి ప్రవేశించడానికి ఫీడర్ పోస్టులుగా ఉంటాయి. అనంతరం వీటి ద్వారా గ్రూప్-1లోకి కూడా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment

Google Sign-in enabled to reduce spam...

Mobile Ad2