Pages

Mobile Ad

February 4, 2014

Group 1 Mains Paper 1- వ్యాసం ఎన్ని పేజీలు రాయాలి?

ప్ర : గ్రూప్-1 మెయిన్స్‌లో ఎస్సే పేపర్‌లో రాయవలసిన మూడు వ్యాసాలలో ప్రతివ్యాసం మాములుగా ఎన్ని పేజీలు రాయాలి? కొంతమంది అభ్యర్థులు సగటున మూడు వ్యాసాలకు కలిపి 20 పేజీలు రాస్తుండగా, మరికొంతమంది అభ్యర్థులు చాలా ఎక్కువ పేజీలు రాయడం జరుగుతుంది. వీటిలో ఏది సరైన పద్ధతి?- కె. సుదీర్, కరీనంగర్.
జ : గ్రూప్-1 జనరల్ ఎస్సే పేపర్‌లో మూడు గంటల సమయంలో మూడు వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఎన్ని పేజీలలో రాయాలన్న విషయం కేవలం అపోహ మాత్రమే. గతంలో ఒకే వ్యాసం రాసే పద్ధతి ఉండేది. మారిన నూతన విధానంలో ఇదే సమయంలో మూడు వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రశ్న చాలా సుదీర్ఘంగా విభిన్న భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది ఒక రకంగా గతంలోని ఆప్షనల్స్ పేపర్లలో వ్యాసరూప ప్రశ్నల కన్నా కొంచెం ఎక్కువ సమాధానాన్ని రాసే విధంగా ఉంటున్నాయి.జనరల్ ఎస్సే రాసేటప్పుడు పేజీల సంఖ్య కన్నా అందు బాటులో వున్న సమయంలో ప్రశ్నలో అడిగిన అన్ని అంశాలను సృశిస్తూ, మిగతా అభ్యర్థుల కన్నా నాణ్యమైన, ఖచ్చితమైన, నిర్థిష్ఠమైన , తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా , సరళమైన భాషలో సులువుగా అర్థమయ్యే విధంగా వేగంగా రాయగలడం పై ప్రధానంగా దృష్టి సారించాలి.పేజీల సంఖ్య అనేది ముఖ్యంకాదు , సమాధానంలోని సమాచారం అత్యంత కీలకమని గుర్తించాలి. అయితే ఒక గంట సమయంలో, అక్షరాల సైజు సాధారణంగా రాయగల అభ్యర్థి అర్థమయ్యే రీతిలో కనిష్టంగా 8 పేజీలు, గరిష్టంగా 12 పేజీల వరకు రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇతరులను అనుకరించకుండా రైటింగ్‌లో వేగాన్ని పెంచుకోవడం, భాషపైన పట్టు సాధించడం, ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండటం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం మంచిది.

No comments:

Post a Comment

Google Sign-in enabled to reduce spam...

Mobile Ad2