Advertisements

July 27, 2022

11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)


11వ పంచవర్ష ప్రణాళిక (2007-12):  పదకొండో పంచవర్ష ప్రణాళిక 2007 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ప్రణాళిక సంఘం ఈ ప్రణాళిక ముసాయిదా పత్రాన్ని 2006 అక్టోబరు 19న ప్రతిపాదించింది. ఈ ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి 2007 డిసెంబరు 19న ఆమోదించింది.  11వ ప్రణాళిక పెట్టుబడి రూ. 36,44,718 కోట్లు. దీంట్లో పదో ప్రణాళిక కంటే 120 శాతం ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. ఇందులో కేంద్రం వాటా రూ. 21,56,571 కోట్లు (59.2 శాతం), రాష్ట్రాల వాటా రూ. 14,88,147 కోట్లు (40.8 శాతం). దీంట్లో ఎక్కువ మొత్తంలో ప్రణాళిక పెట్టుబడి పొందిన రాష్ర్టం - ఉత్తరప్రదేశ్ (రూ. 1,81,094 కోట్లు). రూ. 1,47,395 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
 
 11వ ప్రణాళిక - వనరుల కేటాయింపులు:
 1. సామాజిక సేవలు:  30.3%
 2. శక్తి/ విద్యుచ్ఛక్తి:  23.4%
 3. వ్యవసాయం, నీటి పారుదల: 18.5%
 4. రవాణా, సమాచారం: 18.3%
 5. పరిశ్రమలు, ఖనిజాలు: 4.2%
 6. సైన్‌‌స అండ్ టెక్నాలజీ, పర్యావరణం: 2.4%
 7. సాధారణ ఆర్థిక సేవలు:  1.7%
 8. ఇతర సేవలు:  1.2%
 సామాజిక సేవలు అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, మంచినీరు, పారిశుధ్యం, గృహ వసతి మొదలైనవి. ఈ సామాజిక సేవలో భాగమైన విద్యకు 9.5%, ఆరోగ్యానికి 5% కేటాయింపులు చేశారు. విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా పద కొండో ప్రణాళికను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  ‘విద్యా ప్రణాళిక’గా పేర్కొన్నారు.
 పదకొండో ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చిన రంగాలు:

Advertisements

Followers