బ్యాంక్ పరీక్షకు సిద్ధమైన విద్యార్థులు అరిథ్‌మెటిక్, రీజనింగ్ విభాగాలకు సంబంధించి అన్ని పరీక్షలను సులువుగా ఎదుర్కొనగలరు. అరిథ్‌మెటిక్‌లో సాధారణంగా కనిపించే అంశాలు- బోడ్మాస్ ఆధారిత ప్రశ్నలు, సరాసరి, శాతాలు, సరళ, చక్రవడ్డీలు, పని-కాలం, పని-దూరం, వైశాల్యాలు, చుట్టుకొలతలు.అన్ని పరీక్షలకు ఒకే రీతిన సిద్ధం కావడం సరైనది కాదు. బ్యాంకింగ్‌రంగ పరీక్షల్లో సమయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లు కాన్సెప్ట్ నేర్చుకోవడం, షార్ట్‌కట్స్ తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేయడం అన్న మూడు దశల్లో ప్రిపరేషన్ కొనసాగించాలి.
అలాగే రాష్ట్రంలో నిర్వహించే ఎస్.ఐ. పరీక్షలోనూ అరిథ్‌మెటిక్ విభాగానికి సంబంధించి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పరీక్షకు సిద్ధం అవుతున్న వాళ్లు కూడా వేగంగా సమాధానం కనుగొనేలా ప్రాక్టీస్ చేయాలి. ఇక సీ-శాట్, గ్రూప్ పరీక్షలకు సిద్ధం అవుతున్న వాళ్లు షార్ట్‌కట్స్ తెలుసుకోకున్నా పర్వాలేదు, కాన్సెప్ట్ తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేయడం వరకు పరిమితం అయితే చాలు. ఇవే అంశాలు రీజనింగ్‌కు కూడా వర్తిస్తాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రశ్నలస్థాయి చాలా కఠినంగా ఉంటుంది. ఈ విభాగానికి సంబంధించి కూడా కాన్సెప్ట్‌ను తెలుసుకోవడం, షార్ట్‌కట్స్, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడం మంచిది.
కాన్సెప్ట్ బిల్డింగ్ ఎలా?
Advertisements
