గతంలో వచ్చిన ప్రశ్నలు
1. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంతశాతం పెరిగింది?
1) 17.19 2) 16.64
3) 18.12 4) 17.64 (17.7)
2. 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి?
1) ప్రతీ ఒక్కరూ లెక్కిస్తారు
2) మన జనాభా లెక్కలు, మన భవిష్యత్తు
3) నన్ను లెక్కించండి 4) ఏదీకాదు
3. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యతా శాతం?
1) 64 2) 82 3) 53 4) 73
4. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రెండు రాష్ట్రాలు?
1) ఉత్తరప్రదేశ్, బీహార్
2) ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట
3) ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్
4) ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్
5. 2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) బీహార్
3) కేరళ 4) పశ్చిమ బెంగాల్
6. దేశంలో ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా నమోదైంది?
1) 1911-21 2) 1921-31
3) 1931-41 4) 1941-51
7. {పపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) మే 11 2) జూలై 11
3) సెప్టెంబర్ 11 4) డిసెంబర్ 11
8. భారత జనాభా గణన చట్టం - 1948 ప్రకారం అక్షరాస్యులంటే?
1) చదవడం, రాయడం వచ్చి ఐదేళ్లు నిండిన వారు
2) 6 ఏళ్ల నుంచి చదవడం, రాయడం వచ్చిన వారు
3) 7 ఏళ్ల నుంచి చదవడం, రాయడం వచ్చినవారు
4) 4 ఏళ్ల నుంచి చదవడం, రాయడం వచ్చినవారు
సమాధానాలు
1) 4; 2) 2; 3) 4; 4) 2;
5) 2; 6) 1; 7) 2; 8) 3.
Advertisements
No comments:
Post a Comment