నోబెల్ బహుమతులను తొలిసారి 1901లో ప్రదానం చేశారు. వీటిని ప్రతి ఏటా ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న బహూకరిస్తారు. స్వీడన్ కేంద్ర బ్యాంక్ ‘స్వెర్జిస్ రిక్స్ బ్యాంక్’ 1968లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆర్థిక శాస్త్రంలో బహుమతిని ఏర్పాటు చేసింది. 1969 నుంచి దీన్ని ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరు విభాగా ల్లో నోబెల్ బహుమతులను ఇస్తున్నారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ల్లో నోబెల్ బహుమతులను స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడి ష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అందిస్తోంది. స్వీడన్ లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్.. మెడిసిన్‌లో, స్వీడిష్ అకాడమీ.. లిటరేచర్‌లో ్రపదానం చేస్తాయి. శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తుంది. మిగిలిన ఐదు బహుమతులు స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ్రపదానం చేస్తారు. ఒక్కో విభాగంలో ప్రైజ్‌మనీ 8 మిలియన్ స్వీడిష్ క్రోనార్ లేదా 1.1 మిలియన్ డాలర్లు.
తొలి గ్రహీతలు(1901)
Advertisements