జ : గ్రూప్-1 మెయిన్స్‌లో పేపర్-4, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్‌లో పేర్కొన్న మూడు సెక్షన్‌లు స్వభావం పరంగా జనరల్‌గా ఉన్నప్పటికీ ప్రతి సెక్షన్‌లో పేర్కొన్న సిలబ స్‌లోని అంశాలకు సంబంధించి లోతైన వివరణలు ఉన్నాయి. సాధారణ డిగ్రీ అర్హతగా నిర్వహించబోయే గ్రూప్-1లో సైన్స్ & టెక్నాలజీ సంబంధిత సాంకేతికతతో కూడిన సిలబస్ ఆర్ట్స్ అభ్యర్థులకు కొంత వరకు కఠినమైన అంశమే. అయితే సిలబస్‌లో పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ సమకాలిక అంశాలతో వీటికి గల సంబంధాన్ని ప్రిపరేషన్ సమయంలోనే గుర్తించగలగాలి.2012లో జరిగిన గ్రూప్-1 సైన్స్&టెక్నాలజీ పేపర్‌లో చాలా లోతైన ప్రశ్నలను అడగటం ప్రధాన చర్చానీయాంశంగా మారింది. అభ్యర్థులు దీనివలన ఆందోళనకు గురయ్యారు. అయితే సబ్జెక్టు పరంగా ఇలాంటి ప్రశ్నలు అడగటం సర్వ సాధారణ విషయమే. కాకపోతే ఎక్కువ మంది అభ్యర్థులు మార్కెట్‌లో లభించే ఏదో ఒక మెటీరియల్‌ను చదవడవెూ లేదా కోచింగ్ తీసుకుని దానినే పూర్తిగా నమ్ముకొవడమే జరుగుతున్నది తప్ప సిలబస్‌ను విసృ్తత స్థాయిలో అధ్యయనం చేయడానికి ప్రయత్నించడం లేదు. అందువల్లనే ప్రశ్నలు రోటీన్‌గా కాకుండా ఏ మాత్రం డిఫరెంట్‌గా అడిగినా ఆందోళనకు గురై సమాధానం రాయలేకపోతున్నారుపశ్నా పత్రాన్ని రూపొందించే నిపుణులు సాధారణంగా సబ్జెక్టు స్వభావాన్ని, ప్రాముఖ్యతను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు తప్ప, అభ్యర్థి పరిస్థితిని, మెటీరియల్ లభ్యత, తదితర అంశాలను పట్టించుకోరు. ఇది ప్రొఫెషనలిజమ్‌లో ఒక భాగమే కాబట్టి అభ్యర్థులు ఈ సత్యాన్ని గమనించి తదనుగుణంగా ప్రిపేర్ కావాలి. ఇక మెటీరియల్ సేకరణకు సంబంధించి ఈ పేపర్‌కు సంబంధించిన సమాచారాన్ని స్టాండర్ట్ రిఫరెన్స్ బుక్స్ నుండి పాయింట్ల రూపంలో రాసుకొనేందుకు ప్రయత్నించాలి. తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం బుక్స్,నెట్ సోర్స్‌ల నుండి లభించే సమాచారాన్ని తెలుగులోకి అనువదించు కొని ప్రిపేర్ కావడం మంచింది.
Advertisements
1 comment:
can u please suggest me the standard books for S&T. 3sections
Post a Comment