Advertisements

February 5, 2014

గ్రూప్-1 కేటగిరిలో చివరి పోస్టు ఏమిటి? పోస్టు ప్రాధాన్యం దృష్ట్యా ఏయే పోస్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి?

గ్రూప్-1 కేటగిరిలో చివరి పోస్టు ఏమిటి? పోస్టు ప్రాధాన్యం దృష్ట్యా ఏయే పోస్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి? పోస్టుల ప్రాధాన్యక్రమం ఎలా ఇస్తే బాగుంటుంది?- బి. వసంత నాయక్, ఆదిలాబాద్.జ : రాష్ర్టంలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి సుమారు 27 విభాగాలుగా ఉన్నాయి. అవసరానికనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాల పరిధిని పెంచడం, లేదా తగ్గించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థలో మొదటి ప్రాధాన్యతా ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ (ఆర్.డి.ఓ) కాగా చివరి ప్రాధాన్యతా పోస్టు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎమ్.పి.డి.ఓ) పోస్టుల ప్రాధాన్యానికి సంబంధించి అభ్యర్థుల వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఇతర సదుపాయాలు కూడా అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. సాధారణంగా 99శాతం మంది అభ్యర్థులు ఆర్‌డిఓకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది నిబంధన కాదు, అభ్యర్థి తన వ్యక్తిగత ఇష్టానికి అనుగుణంగా డియస్.పి, సి.టి.ఓ , ఆర్.టి.ఓ, వంటి పొస్టులను కూడా మొదటి ప్రాధాన్యత పొస్టులుగా పెట్టుకోవచ్చు. పొస్టుల ప్రాధాన్యానికి ఇచ్చే క్రమం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే జీవితాంతం భాదపడాల్సి ఉంటుంది. వేతనం, ఇతర భత్యాలు కొన్ని పొస్టులకు ఒకే విధంగా ఉన్నప్పటికి వాటిలో కొన్నింటి ద్వారా మాత్రమే సమాజసేవలో ప్రత్యక్షంగా భాగస్వామిగా మారడంతో పాటు, సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం లభిస్తుందియగూప్-1లో ఉన్న ఉద్యోగాలన్నీ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రతి పోస్టు ఒక ప్రత్యేక విధిని నిర్వహించేందుకు సంబంధించినవిగా ఉంటాయి. వీటిలో కొన్నింటికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. (కమర్షియల్ టాక్స్, ఆడిట్ తదితర) కాని ప్రభుత్వ నిర్వహణ ప్రజల సంక్షేమం, అభివృద్ధిలో వీటి పాత్ర కూడా క్రీయాశీలకంగా ఉంటుంది. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్-1 ద్వారా అఖిల భారత సర్వీసులలోకి (ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.) ప్రవేశించడానికి అవకాశం గల డిర్‌డిఓ, డియస్‌పి వంటి ఉద్యోగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడతారు. అయితే డియస్‌పి ఉద్యోగానికి ధైర్యం, సమస్యలను నిరంతరం ఎదుర్కొనే సామర్థ్యం గల అభ్యర్థులు మొదటి లేదా రెండవ ప్రాధాన్యతను ఇవ్వవచ్చు.

Advertisements

No comments:

Followers