Advertisements

February 24, 2014

కేంద్ర బడ్జెట్ 2014-15 విశేషాలు

కేంద్ర ప్రభుత్వం పక్షాన 2014-15 వార్షిక అర్థిక సంవత్సరానికి 17, 63, 214 కోట్ల వ్యయంతో మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నెల17 ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్లో గణాంకాలు..
ప్రణాళిక వ్యయం రూ 5, 55, 322 లక్షల కోట్లు. ప్రణాళికేతర వ్యయం రూ 12, 07, 892 కోట్లువూపణాళిక వ్యయం అంటే వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రణాళిక సంఘంతో చర్చించి, ఆయా శాఖలకు చేసే కేటాయింపులు. ప్రణాళికేతర వ్యయం అంటే ప్రభుత్వ రంగ సంస్థలకు రుణాలు, రాయితీలు, వడ్డీ చెల్లింపులు తదితర అంశాలు. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం మూలధన వ్యయంలో భాగంగా ఉంటాయి.
ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ భారం రూ 2, 46, 397 కోట్లు. కేవలం ఆహార సబ్సిడీనే 

రూ 1, 15, 000 కోట్లు. కేంద్రం ఆహార భద్రత చట్టాన్ని సెప్టెంబర్ 12, 2013 చేసింది. దేశంలోని మొత్తం జనాభాలో 2/3 వంతు మంది ప్రజలకు తక్కువ ధరకు బియ్యం, గోధుమలు, ముతక ధాన్యాలను అందించే ఉద్దేశంతో చట్టాన్ని కేంద్రం చేసింది. ఆదాయపు పన్ను, ఇతరత్రా ప్రత్యక్ష పన్ను రేట్లలో మార్పులేదు. పరోక్ష పన్ను రేట్లు మాత్రం మారాయి

పన్ను ఆరంభ, అంతిమ భారాలు ఒకే వ్యక్తి భరిస్తే దానిని ప్రత్యక్ష పన్ను అంటారు. పన్ను ఆరంభ భారం ఒకరిపైన, అంతిమ భారం మరొకరిపైన పడితే దానిని పరోక్ష పన్ను అంటారు. ఉదాహరణకు అమ్మకపు పన్ను.అమ్మకందారుపై వేసే పన్నును అతడు దానిని వినియోగదారుడికి బదిలీ చేస్తాడు. మధ్యంతర బడ్జెట్ రెవిన్యూలోటు రూ 3,82,923 కోట్లు. బడ్జెట్లో రాబడికన్నా, వ్యయం అధికంగా ఉంటే దానిని రెవిన్యూ లోటు అంటారు. ప్రాథమిక లోటు రూ 1, 01, 620 కోట్లు.కోశలోటుకి, వడ్డీ చెల్లింపులకు ఉన్న వ్యత్యాసమే ప్రాథమిక లోటు
వివిధ పథకాలు కేటాయింపులు: కేంద్రం ప్రారంభించిన పలు పథకాల అమలుకుగానూ కేంద్రం అదనపు సాయం భారీగా పెంచింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు కేవలం రూ 1,19,038 కోట్లు మాత్రమే ఉండగా, 2014-15 సంవత్సరానికిగానూ ఇవి రూ 3, 38, 562 కోట్లకు పెరిగాయి. 
వివిధ పథకాలకు కేటాయింపులు..
-ఉపాధి హామీ పథకానికి రూ 34, 000 కోట్లు.
- ఉపాధి హామీ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2, ఆంధ్రవూపదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. ప్రారంభంలో దేశ వ్యాప్తంగా 200 జిల్లాల్లోనే అమలు చేసినా, 2008-09 నుంచి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యంలేని పనుల్లో కనీసం నిర్ణీత పారంభంలో 100 రోజులు, ప్రస్తుతం గిరిజనులకు 150 రోజులు) రోజులు పని కల్పించే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. 
- సర్వశిక్షా అభియాన్కు రూ 27, 635 కోట్లు
-ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా (ఆర్టీఈ) మార్చేందుకు దీనిని ప్రారంభించారు. ఆర్టీఈ చట్టం ఏప్రిల్ 1, 2010లో అమల్లోకి వచ్చింది
-జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం: పథకం కింద పట్టణాభివృద్ధికిగాను రూ 7. 060 కోట్లు కేటాయించారు. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకాన్ని 2005-06లో ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహ నిర్మాణం, అవస్థాపనా సౌకర్యాలు కల్పించడానికి ఉద్దేశించిన పథకం ఇది. 
నిర్భయ నిధికి మరో వెయ్యి కోట్లు: మహిళల భద్రత, సాధికా రతకుగానూ నిర్భయ నిధికి అదనంగా రూ 1,000 కోట్లు కేటాయించారు. నిర్భయ నిధిని రూ 1,000 కోట్లతో 2013-14 బడ్జెట్లో ఏర్పాటు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ పర్యవేక్షణ, సీసీటీవీల ఏర్పాటు, జీపీఎస్ వ్యవస్థతో పాటు పోలీసులు, అధికారులను తక్షణమే అప్రమత్తం చేసేందుకు అలర్ట్ మీటలను వాహనాలలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు నిధి నుంచి ఖర్చు చేయనున్నారు. 

పలు ఇతర పథకాలు- కేటాయింపులు
మధ్యాహ్న భోజన పథకానికి రూ. 13, 152 కోటు.్ల
ఐసీడీఎస్కు రూ. 18, 691 కోట్లు
గ్రామీణ గృహ నిర్మాణానికి రూ. 16, 000 కోట్లు.
ప్రధాన మంత్రి గ్రామీణ రహదారి యోజనకు రూ. 13, 000 కోట్లు.
తాగునీటి సరఫరాకు రూ. 11, 000 కోట్లు.
గ్రామీణ పారిశుధ్యానికి రూ. 4, 260 కోట్లు.


-రాజ్యాంగంలో బడ్జెట్ అనె పదాన్ని వాడలేదు. 112 అధికరణంలోయాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్అని పేర్కొన్నారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఆర్.కె.షణ్ముఖం చెట్టి. ఆయన తొలి బడ్జెట్ను నవంబర్ 26, 1949లో ప్రవేశపెట్టారు.
-భారత దేశంలో ఇప్పటి వరకు ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత మురార్జీ దేశాయిది. 
-ప్రస్తుత ఆర్థిక మంత్రి చిదంబరం తొలిసారిగా తన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 
-2000 సంవత్సరం వరకు బడ్జెట్ను సాయంత్రం అయిదు గంటలకు ప్రవేశపె 2000 సంవత్సరంలో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, సంప్రదాయానికి తెరవేశారు. ఆయన మధ్యాహ్నం 11 గంటలకే బడ్జెట్ను ప్రవేశ పెట్టే సంప్రదాయానికి తెర తీశారు. ఇతర కేటాయింపులు సంక్షిప్తంగా......
-2015 నాటికి దేశంలోని 1.55 లక్షల పోస్టాఫీసులను ఆధునీకరించేందుకు రూ 4, 909 కోట్లు కేటాయించారు.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కు రూ 443.79 కోట్లు కేటాయించారు, ఇది గత బడ్జెట్తో పోలిస్తే, 17% అధికం. 
-ఉన్నత విద్య కోసం 2009 మార్చి 31కి ముందు తీసుకున్న విద్యా రుణాలపై మారటోరియం విధించారు, దీంతో విద్యార్థులు రూ 2, 600 కోట్ల మేర ప్రయోజనం పొందుతారు
-లోక్పాల్ వ్యవస్థల ఏర్పాటుకు రూ 2 కోట్లను టోకెన్ రూపంలో కేటాయించారు. కేంద్ర విజిపూన్స కమిషన్కు ప్రణాళికేతర వ్యయం కింద రూ 20. 35 కోట్లు కేటాయించారు. 
-కోటికి మించి ఉన్న ఆదాయ వర్గాలకు పదిశాతంసూపర్ రిచ్పన్ను కొనసాగుతుంది. రూ పది కోట్లకు మించి టర్నోవర్ కలిగిన కార్పొరేట్లపై 5% సర్ చార్జీ విధిస్తారు.
-చిన్నకార్లు, మోటార్ సైకిళ్లు, వ్యాపార వాహనాలపై ఎక్సైజ్ సుంకం 12% నుంచి 8 శాతానికి తగ్గింపు. మొబైల్ ఫోన్లపై ఎక్సైజ్ సుంకం 6 శాతానికి తగ్గింపు.
-రక్తనిధి కేంద్రాలకు సేవా పన్ను నుంచి మినహాయింపు.
-ప్రభుత్వ రంగ బ్యాంక్లకు రూ 11, 200 కోట్ల నిధులు మంజూరు.
-2.1 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులకు ఆధార్ ద్వారా రూ. 3, 370 కోట్ల రాయితీ
-ఎస్సీ ఉపవూపణాళికకు రూ 48, 638 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ 36, 760 కోట్లు. డ్వాక్రా సంఘాలకు రూ. 41 వేల కోట్లు.
-రక్షణకు రూ 2, 24,000 కోట్లు. ఇది గత బడ్జెట్ కేటాయింపు కన్నా 10%అధికం.
-మాజీ సైనికులకుఒకే హోదా ఒకే పింఛనుఅమలు. ఇందుకుగానూ రూ. 500 కోట్ల కేటాయింపు. సమాన హోదాలో ఉన్న సైనికులు వారు సేవలందించిన కాల వ్యవధి సమానంగా ఉంటే పదవీ విరమణతో సంబంధం లేకుండా ఒకే పింఛను అందుతుంది. 
-ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.6%, 2014-15లో ఇది 4.1% ఉంటుందని అంచనా.

Advertisements

No comments:

Followers