Advertisements

March 2, 2014

Sense Organs- Quiz in Biology for General Knowledge

జ్ఞానేంద్రియాలు
 1.    దేహంలో అతిపెద్ద అవయవం ఏది?
     చర్మం
 2.    చర్మం గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
     డెర్మటాలజీ
 3.    చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే వర్ణకం పేరు?
     మెలనిన్
 4.    గోర్లు, కొమ్ములు, రోమాల్లో ఉండే ప్రోటీన్?
     కెరాటిన్
 5.    శరీరంపై రుచి గ్రాహకాలను  కలిగి ఉండే జీవులు?
     చేపలు, అకశేరుకాలు
 6.    ఏ జ్ఞానేంద్రియాలు రసాయన జ్ఞానాలను గుర్తిస్తాయి?
     ముక్కు, నాలుక
 7.    జ్ఞానేంద్రియాలన్నింటిలో కెల్లా ముఖ్యమైంది?
     కన్ను
 8.    దేహ ఉష్ణోగ్రతను క్రమపరిచే జ్ఞానేంద్రియం?
     చర్మం
 9.    ఎక్కువ ధ్వని తీవ్రతకు గురైన చెవిలో మోగుతున్నట్లు ఉండే స్థితిని ఏమంటారు?
     టిన్నిటస్

 10.    ఇంద్రియ జ్ఞానం అనేది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి?
     జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు
 11.    కంటిలోని దండాలు, కోనుల నిష్పత్తి?
     15:1
 12.    కంటి ఫోవియా లేదా ఎల్లో స్పాట్‌లో ఉండే కణాలు?
     కోనులు/శంకు కణాలు
 13.    దండాలు, కోనుల్లో ఉండే పదార్థాలు?
     రొడాప్సిన్, ఐడాప్సిన్
 14.    క్షీరదాల్లో ఉన్న దృష్టి రకం?
     బైనాక్యులర్ విజన్
 15.    మధ్య చెవికి, గ్రసనితో సంబంధాన్ని ఏర్పరిచే నిర్మాణం?
     {శోతఃపథనాళం/యుస్టాచియన్ నాళం
 16.    దేహంలోని అతిచిన్న ఎముక పేరు?
     స్టేపిస్/కర్ణాంతరాస్థి/అంకవన్నె
 17.    శరీర సమతాస్థితికి సహాయపడే జ్ఞానేం ద్రియం?
     చెవి
 18.    మధ్య చెవిలోని ఎముకల సంఖ్య?
     మూడు
 19.    మానవుని అంతర చెవిలోని అర్ధవర్తుల కుల్యల సంఖ్య?
     మూడు
 20.    విసర్జన క్రియలో ఏ జ్ఞానేంద్రియం పాల్గొంటుంది?
     చర్మం
 21.    మన కంటిలోని కటకం ఏ ఆకారంలో ఉంటుంది?
     ద్వికుంభాకారం
 22.    బేసిలార్ త్వచం ఏ జ్ఞానేంద్రియానికి సంబంధించింది?
     చెవి
 23.    జంతువుల కళ్లు చీకటిలో మెరవడానికి కారణం?
     వాటి నేత్రపటలానికి ముందు టపేటమ్ లూసిడమ్  పొర ఉండటం.
 24.    కంటిగుడ్డును కదపడానికి ఎన్ని కండరాలు పనిచేస్తాయి?
     ఆరు

Advertisements

No comments:

Followers