కొత్త రాష్ర్టాల ఏర్పాటు, రాష్ర్టాల చేరిక వంటి విషయాలు భారత రాజ్యాంగంలోని ఒకటో భాగంలో ప్రకరణ 1 నుంచి 4 వరకు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఒకటో నిబంధనలో భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్ (యూనియన్ ఆఫ్ స్టేట్స్)గా పేర్కొన్నారు. సమాఖ్య (ఫెడరేషన్) అని ఎక్కడా పేర్కొనలేదు. భారత భూభాగంలో రాష్ర్టాలు, కేంద్రపాలితప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆర్జించిన ప్రాంతాలు ఉంటాయి. ప్రాదేశిక జలాలు, భారత అంతరిక్ష సరిహద్దులు కూడా ఉంటాయి. ఈ అన్ని అంశాలకు భారత సార్వభౌమత్వం వర్తిస్తుంది.
-ఒక రాష్ట్రం నుంచి మరొక కొత్త రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడం
-డు లేదా మూడు రాష్ర్టాలను కలిపి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం
-రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం, తగ్గించడం
-రాష్ర్టాల సరిహద్దులను మార్చడం
-రాష్ర్టాల పేర్లను మార్చడం
రాష్ర్టాల ఏర్పాటు - సరిహద్దుల మార్పు
మూడో ప్రకరణలో పేర్కొన్న అన్ని అంశాలకు ఒకే ప్రక్రియ ఉంటుంది. వాటికి సంబంధించిన బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. దీనికోసం రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. కాగా, పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టేముందు దానికి సంబంధించిన రాష్ట్ర శాసన సభల అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరుతారు. ఆ శాసనసభలు వ్యక్తంచేసిన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. ఈ బిల్లులను పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తుంది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు.
రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణ
స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో రెండు రకాలైన రాజకీయ భాగాలు ఉన్నాయి. అవి..
uనేరుగా బ్రిటీష్ ప్రభుత్వం నియంత్రణలో ఉన్నవి
ఫుబిటీష్ సార్వభౌమాధికారం కింద పనిచేసే సంస్థానాలు (స్వదేశీ సంస్థానాలు)
1947 ఆగస్టు 17 నాటికి దేశంలో 552 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. అయితే బ్రిటీష్‌వారు ప్రకటించిన విలీన ఒప్పందం ప్రకారం 549 సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ సంస్థానాలు అందుకు ఒప్పుకోలేదు. తర్వాత జరిగిన విలీన ఒప్పందం ద్వారా కాశ్మీర్ ప్రజాభిప్రాయం ద్వారా జునాగఢ్‌లు భారత యూనియన్‌లో భాగమయ్యాయి. ప్రజాభిప్రాయం ద్వారా కలిసిన మొదటి, చివరి సంస్థానం ఇదే. కాగా, పోలీస్ చర్య (ఆపరేషన్ పోలో) హైద్రాబాద్ సంస్థానాన్ని 1948, సెప్టెంబర్ 17లో బలవంతంగా విలీనం చేశారు.
భాషా ప్రయుక్త రాష్ర్టాలు
రాష్ర్టాలను భాషా ప్రాతిపదికపైన ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ఉండేది. ఈ డిమాండ్ మొదటిసారిగా తెలుగువారే చేశారు.
uతెలుగు మాట్లాడే ప్రాంతాలను మద్రాసు నుంచి వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 1919లో జరిగిన ఆంధ్రమహాసభ డిమాండ్ చేసింది.
-1931లో జరిగిన రెండో రౌండ్ సమావేశానికి హాజరైన గాంధీజీ ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర డిమాండ్‌పై చర్చించాలని కోరారు.
-1919 మాంటెంగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల్లో కూడా భాషా ప్రాంతాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు.
-1937లో రాయలసీమ-ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. (కాశీనాథుని నాగేశ్వరరావు నివాసం పేరు శ్రీబాగ్) అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో మద్రాసు, ఆంధ్ర నాయకుల మధ్య వచ్చిన వివాదాలు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు కారణాలుగా చెప్పవచ్చు.
థార్ కమిషన్
భాషాప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు విషయాన్ని పరిశీలించడానికి 1947లో ఉత్తరప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌కే థార్ నేతత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన కమిషన్‌ను రాజ్యాంగ పరిషత్తు నియమించింది. అయితే కేవలం భాషను ప్రాతిపదికగా చేసుకొని రాష్ర్టాలను ఏర్పాటు చేయడాన్ని కమిషన్ తిరస్కరించింది.
జేవీపీ కమిటీ
థార్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో వాటిని నిలువరించడానికి 1948 డిసెంబర్‌లో భారత కాంగ్రెస్ కమిటీ జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా రాష్ర్టాల పునర్‌నిర్మాణాన్ని వాయిదా వేయాలని తెలిపింది. అయితే ఆంధ్రరాష్ర్టాన్ని మాత్రం దీనిని నుంచి మినహా ఇంచాలని పేర్కొంది.
వాంఛూ కమిటీ
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు విధి విదానాలను ఏర్పరచడానికి రాజస్థాన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కైలాస్‌నాథ్ వాంఛూ నాయకత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సూచన మేరకు ఆంధ్ర, రాయలసీమలోని 11 జిల్లాలతో కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పాటయింది.
రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికపై రాష్ర్టాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ అధికమైంది. దీంతో కేంద్రప్రభుత్వం ఫజల్ అలీ నాయకత్వంలో కేఎం ఫణిక్కర్, హెచ్‌ఎం కుంజ్రులతో కూడిన రాష్ర్టాల పునర్‌వ్యవస్టీకరణ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 1955 సెప్టెంబర్‌లో నివేదికను సమర్పించింది. భాషా ప్రాతిపదికగా ఒకే భాష ఒక రాష్ట్రం డిమాండ్‌ను తిరస్కరించింది. దీనికి అనుగుణంగా 1956లో ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ర్టాల మధ్య ఉన్న పార్ట్-ఏ, పార్ట్-బీ, పార్ట్-సీ అనే వ్యత్యాసాలను రద్దు చేసిన పార్లమెంట్ రాష్ర్టాలను భాషాప్రాతిపదికన పునర్‌వ్యవస్థీకరించింది. దీంతో దేశంలో 14 రాష్ర్టాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.
1950లో భారతదేశంలో పార్ట్-ఏ, పార్ట్-బీ, పార్ట్-సీ, డీ అనే నాలుగు రకాల రాష్ర్టాలు అమలులో ఉండేవి. అవి..
పార్ట్-ఏలో ఉన్న రాష్ర్టాలు
అస్సాం, బీహార్, బాంబే, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒరిస్సా, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్, పశ్చిమ బెంగాల్
పార్ట్-బీ: హైద్రాబాద్, జమ్ము & కశ్మీర్, మధ్యభారత్, మైసూర్, పాటియాలా, తూర్పు పంజాబ్, రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్‌కోర్ కొచ్చిన్, వింధ్యప్రదేశ్
పార్ట్-సీ: అజ్మీర్, భూపాల్, బిలాస్‌పూర్, కూచ్ బీహార్, కూర్గ్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కచ్, మణిపూర్, త్రిపుర.
పార్ట్-డీ: అండమాన్, నికోబార్ దీవులు
కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలు
1956లో భాషా ప్రాతిపదికన దేశంలో 14 రాష్ర్టాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. అవి..
ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బాంబే, జమ్ము & కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్‌బెంగాల్
కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్-నికోబార్ దీవులు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, లక్షదీవి, మినికాయ్-అమైన్‌దీవులు, మణిపూర్, త్రిపుర.
Also Read: - History of Joint Sittings in Indian Parliament
- Quiz-19 - Indian Constitution 120 Mcqs
- Procedure For Passing Bills in Indian Parliament
- Understanding Some Important Terms while preparing for Indian Constitution
- Speaker of the Lok Sabha: Role, Function and Powers
- Famous Slogans and their originators
- Important Age Limits in Polity
- India highest Honor Awards
- Indian polity 600 MCQs
Advertisements
1 comment:
Sir please post these topics (indian constitution) details in English language. ...
Post a Comment