Advertisements

May 10, 2014

Political Defections/ Anti-Defection Law of 10th Schedule

Anti-Defection Law and the provisions of disqualification
Purpose of Law: To discourage the practice of defection of members from one party to another after their election, the Constitution 52nd Act, 1985 was enacted by the Parliament.
The Tenth Schedule - popularly known as the Anti-Defection Act - was included in the Constitution in 1985 by the Rajiv Gandhi Government.

This Act Amendments Article:
Article 102- regarding Members of either Houses of Parliament - a person shall be disqualified for being a member of the state Legislature if he is so disqualified under the Tenth Schedule.
Article - 191 - regarding Members of state legislatures - a person shall be disqualified for being a member of the state Legislature if he is so disqualified under the Tenth Schedule.

Anti-Defection Law for upsc ias and appsc exams
What are the grounds for disqualification under the Anti-Defection Law's Articles 102 (2) and 191 (2)?
a) If an elected member voluntarily gives up his membership of a political party;
b) If he votes or abstains from voting in such House contrary to any direction issued by his political party or anyone authorised to do so, without obtaining prior permission.
As a pre-condition for his disqualification, his abstention from voting should not be condoned by his party or the authorised person within 15 days of such incident.
What were the loopholes and Exceptions mentioned in this Act where Defection is valid:
  1. Previously, If there is split in a party and one-third of the elected members of a political party form a separate group then this did not attract disqualification. However this was removed by 91st Constitutional Amendment Act, 2003.
  2. In a situation where in the original political party with the support of 2/3 rd members merges with another political party (not less than two-thirds of the members of Legislature belonging to the original political party agree to such merger). The merger of the original political party or a member of a House shall be deemed to have taken place if, and only if, not less than two-thirds of the members of the legislature party concerned have agreed to such merger," states the Tenth Schedule.
  3. However, if a member of the original  political party opts to function as a separate group old group that may or may not maintain the identity  of the older political party, he is not disqualified.
Exemption.- A person who has been elected to the office of the
  1. Speaker or the Deputy Speaker of the House of the People
  2. the Deputy Chairman of the Council of States
  3. the Chairman or the Deputy Chairman of the Legislative Council of a State
  4. the Speaker or the Deputy Speaker of the Legislative Assembly of a State
 shall not be disqualified under this Schedule.

Who decides disqualification of members in this Schedule?
  1. Decision on questions as to disqualification on ground of defection.-If any question arises as to whether a member of a House has become subject to disqualification under this Schedule, the question shall be referred for the decision of the Chairman or, as the case may be, the Speaker of such House and his decision shall be final.
  2. Bar of jurisdiction of courts.- Notwithstanding anything in this Constitution, no court shall have any jurisdiction in respect of any matter connected with the disqualification of a member of a House under this Schedule.
--------------------------------------------------------------------------------------------------
ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కుతో వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ప్రక్రియ, ప్రాతినిధ్యం రాజకీయ పార్టీల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే ఒక రాజకీయ పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులు, అధికారం కోసం రాజకీయ విలువలను పాటించకుండా అవకాశవాదంతో తరచూ పార్టీలు మారడం, ఫిరాయింపులు చేస్తున్నారు. దీంతో రాజకీయ స్థిరత, ప్రజాభిప్రాయం వమ్మవుతున్నది. దీనిని అరికట్టడానికే ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రవేశపెట్టింది.
1985లో 52వ రాజ్యాంగ సవరణ చేసి రాజీవ్‌గాంధీ నేతత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా పార్టీఫిరాయింపుల చట్టాన్ని రూపొందించింది. దీనికి సంబంధించి రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చారు. దీనివల్ల ఒక పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులు తన పదవీకాలం పూర్తికాకుండానే మరో పార్టీలో చేరితే రాజ్యాంగంలోని 102(2), 191(2) ప్రకరణల ప్రకారం పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ్యులు అనర్హతకు గురవుతారు. అయితే ఈ చట్టానికి 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మరికొన్ని సవరణలు చేశారు. 

2003లో చేసిన సవరణలు

-కేంద్రంలో ప్రధానమంత్రితో సహా మంత్రిమండలి సంఖ్య లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో 15 శాతానికి మించకూడదు. రాష్ర్టాలకు కూడా ఇదే వర్తిస్తుంది. అయితే రాష్ర్టాల్లో మంత్రిమండలి సంఖ్య 12కు తగ్గకూడదు. 
-పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించిన పార్లమెంటు, శాసనసభ్యులను మంత్రులుగా నియమించడానికి, ఆదాయ, లాభదాయన పదవుల్లో నియమించడానికి అనర్హులు.
-10వ షెడ్యూల్‌లో పార్టీ ఫిరాయింపు అనర్హతలకు మినహాయింపుగా పేర్కొన్న చీలిక (split) అనే పదాన్ని తొలగించారు. గతంలో ఒక రాజకీయ పార్టీ నుంచి 1/3వ వంతు సభ్యులు చీలిక ద్వారా బయటికి వచ్చి స్వతంత్రంగా ఉంటే వారి సభ్యత్వం రద్దయ్యేది కాదు. ఈ సవరణ ద్వారా ఈ మినహాయింపును తీసివేశారు. 
పదవులు కోల్పోతారిలా..

-ఒక పార్టీ తరఫున ఎన్నికైన శాసన సభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినపుడు
-పార్టీ జారీచేసిన విప్‌ను ధిక్కరించి సభ్యులు సభకు గైర్హాజరైనపుడు, వ్యతిరేకంగా ఓటు వేసినపుడు
-స్వతంత్ర అభ్యర్థులు శాసనసభలకు ఎన్నినకైన తర్వాత ఏదైనా పార్టీలో చేరితే..
-పార్లమెంట్ / రాష్ట్ర శాసనసభలకు నామినేట్ అయిన సభ్యులు ఏదైనా రాజకీయ పార్టీలో చేరినపుడు వారి సభ్యత్వం రద్దవుతుంది. అయితే వారు నామినేటైన రోజు నుంచి ఆరు నెలల్లోపు ఏదైనా పార్టీలో చేరినపుడు మాత్రం సభ్యత్వం రద్దుకాదు.
మినహాయింపులు

ఈ చట్టానికి పలు మినహాయింపులు కూడా ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో పేర్కొన్న అనర్హతలు కొన్ని సందర్భాల్లో వర్తించవు..
-ఒక రాజకీయ పార్టీలోని మొత్తం శాసనసభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు వేరుపడి మరొక రాజకీయ పార్టీలోకి చేరినా.. అలాకాకుండా స్వతంత్రంగా వేరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నా వారికి పార్టీ ఫిరాయింపుల చట్టాలలోని అనర్హతలు వర్తించవు.
-లోక్‌సభ, రాష్ట్ర విధానసభ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, విధానసభ చైర్మన్, వైస్ చైర్మన్లు తమ పదవికి రాజీనామా చేసినా లేదా పదవీకాలం ముగిసిన తర్వాత వేరొక పార్టీలో చేరినా వారి సభ్యత్వం రద్దుకాదు.

సభ్యత్వాన్ని రద్దుచేసేదెవరు..

పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రాతిపదికన శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం సభాధ్యక్షునికి ఉంటుంది. ఆయా పార్టీ అధ్యక్షుని ఫిర్యాదు మేరకు సభాధ్యక్షుడు సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు. ఈ విషయంలో ఆయనదే తుదినిర్ణయం. సభాధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీలులేదు. కానీ 1993లో కివోటో ఉలాహాన్ వర్సెస్ జాచిలు కేసులో సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ను కొట్టివేసింది. సభాధ్యక్షునిదే తుది నిర్ణయం కాదని, అది న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని, సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమని తీర్పునిచ్చింది. 

చట్టంతో లాభాలు

-రాజకీయ సుస్థిరత సాధించవచ్చు
-అవకాశవాద, అధికారపూరిత రాజకీయాలను అరికట్టవచ్చు
-రాజకీయపార్టీల్లో అవినీతిని, అనైతిక ప్రవర్తనలను నిరోధించవచ్చు.
Also Read Indian Polity for UPSC IAS APPSC BANK Exams:

Advertisements

No comments:

Followers