Advertisements

July 7, 2014

How to prepare for IBPS Exam? - Telugu Medium Review

ఇండియన్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) . డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసిన వారితో పాటు డిగ్రీ పూర్తిచేసిన వారికి ఇదో సువర్ణావకాశం. పక్కా ప్రణాళికతో సిద్ధమయితే బ్యాంక్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.
విద్యార్థులు ఏం చేయాలి: ప్రిపరేషన్లో రెండు అంశాలు కీలకమైనవి.  అవి..
1. కాన్సెప్ట్ బిల్డింగ్ 
2. ప్రాక్టీస్ 
రెండు దశల ప్రారంభానికి ముందే సిలబస్పై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలి. 
పీవో, క్లర్క్ పరీక్షల సిలబస్:
పీవో, క్లర్క్ పరీక్షల సిలబస్ పరంగా చూస్తే దాదాపుగా ఒకే తరహా అంశాలు కనిపిస్తాయి. ప్రశ్నల కఠినస్థాయిలోనే తేడా ఉంటుంది. రీజనింగ్, ఆప్టిట్యూడ్ విభాగాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ తదితర విభాగాల్లో పెద్దగా తేడా ఉండదు. 


రీజనింగ్లో తేడా..
ప్రొబేషనరీ పరీక్షల్లో క్లర్క్ సిలబస్కు అదనంగా మరికొన్ని అంశాలు ఉంటాయి. అవి కాజ్ అండ్ ఎఫెక్ట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్-అసంప్షన్స్, స్టేట్మెంట్-కన్క్లూజన్స్, డాటా సఫీషియన్సీ.

రెండు స్థాయి పరీక్షల్లోనూ కామన్గా ఉండే అంశాలు- సిలాజిసం, సిట్టింగ్ అరెంజ్మెంట్, ఫజిల్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, అల్ఫాబేస్డ్ క్వశ్చన్స్


ఆప్టిట్యూడ్:
కేవలం ప్రొబేషనరీ పరీక్షల్లో ఉన్న అంశాలు-డాటా ఇంటర్ప్రిటేషన్. రెండు తరహా పరీక్షల్లోనూ అరిథ్మెటిక్ కామన్గా ఉంటుంది. 

ప్రిపరేషణ్ ఎలా..
ప్రిపరేషన్ కాన్సెప్ట్ బిల్డింగ్, ప్రాక్టీస్ విధానంలో ఉండాలి. కాన్సెప్ట్ బిల్డింగ్కు సంబంధించి రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్ అంశాల్లో అన్ని విభాగాల్లో ఉన్న అధ్యాయాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. చాలామంది అంశాల అవగాహన లేకుండా కేవలం షార్ట్కట్స్పై ఆధారపడతారు. ఇది సరైన విధానం కాదు, రీజనింగ్, ఆప్టిట్యూడ్లతోపాటు జనరల్ అవేర్నెస్లోనూ కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉదాహరణకు ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే, ఆర్బీఐ రేటును పెంచుతుంది..? అంటూ అడిగారు, తరహా ప్రశ్నలకు సమాధానం కావాలంటే, మా ర్కెట్లో ద్రవ్యచలామణిని నియంత్రించడానికి ఆర్బీఐ ఉపయోగించే రెపో రేట్, సీఆర్ఆర్ వంటి అస్ర్తాలపై అవగాహన అవసరం. అందుకే ఆబెక్టివ్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్ కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్ సత్ఫలితాన్ని ఇస్తుంది. 

ప్రాక్టీస్
ప్రాక్టీస్ కూడా రెండు అంశాల ప్రాతిపదికన జరగాలి. 

1. అధ్యాయాల వారీగా ప్రిపరేషన్ 2. పూర్తి స్థాయి మాక్ పరీక్ష (మాక్ టెస్ట్) 
చాలామంది విద్యార్థులు కేవలం పూర్తి స్థాయి మాక్ పరీక్షలు రాస్తూ ఉంటారు. జవాబులను పరిశీలించరు. మొత్తం స్కోర్ పెరిగిందా? లేదా? అన్నది మాత్రమే చూస్తారు. ఇది పాక్షికంగా మాత్రమే మేలు చేస్తుంది. అయితే మరింత లోతైన విశ్లేషణ అవసరం. రెండు పూర్తిస్థాయి మాక్ పరీక్షలు రాసిన తర్వాత అంశాల వారీగా పరిశీలించాలి. విభాగంలో ఎక్కువ తప్పులు చేస్తున్నా మో చూసుకోవాలి. ఉదాహరణకు రీజనింగ్లో సిలాజిసం నుంచి క్రమం తప్పకుండా 5 ప్రశ్నలు వస్తున్నాయి. తరచూ విభాగంలో తప్పులు చేస్తూ ఉంటే అంశానికి సంబంధించిన బేసిక్స్ను బాగా సిద్ధం కావాలి. అధ్యాయానికి సంబంధించి నాలుగు రకాల స్టేట్మెంట్లు, వాటి కన్వర్షన్స్, ఎడిషన్ రూల్స్ను మరోసారి తెలుసుకోవాలి. అయితే 2012 నుంచి సిలాజిసం విభాగంలో పాజిబిలిటీ అన్న పదంతో కొత్త రీతిలో ప్రశ్నలను ఇస్తున్నారు. కాబట్టి దానికి కూడా సిద్ధం కావాలి. పాత తరహా విధానంలో సిద్ధమయితే అది స్కోర్పై ప్రభావం చూపిస్తుంది. 
విభాగాల వారీగా ప్రిపరేషన్ తీరు ఎలా ఉండాలి. అలాగే పరీక్షలో సమయ ప్రణాళిక ఎలా ఉండాదలన్న అంశాలను వచ్చే వారం పరిశీలిద్దాం..



- కాన్సెప్ట్ బిల్డింగ్కు ఎక్కువ సమయం కేటాయించరాదు. గరిష్ఠంగా 20 నుంచి 30 రోజుల్లో పూర్తి చేయాలి. తర్వాత పూర్తిగా అధ్యాయాల వారీగా పరీక్షలు, మాక్టెస్ట్లపై దష్టి సారించాలి
- క్లరికల్లో అరిథ్మెటిక్కు కేటాయించిన 50 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు సింప్లిఫికేషన్పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి క్లర్క్ పరీక్షలకు బోడ్మాస్ ఆధారిత ప్రశ్నలకు నిత్యం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి
- జనరల్ అవేరెనెస్కు సంబంధించి పరీక్షకు ముందు 8 నెలల అంశాలను పరిశీలించాలి. ముందుగా అంశాలను క్రోడీకరించుకోవాలి. ఉదాహరణకు ఏడాది జరగనున్న పరీక్షల్లో రాదగ్గ అంశాలు- భారతదేశంలో ఎన్నికలు-ఫలితాలు ( ముఖ్య వ్యక్తుల నియోజకవర్గాలు ఉదాహరణకు మోడి-వడోదర, వారణాసి). అలాగే ఏర్పాటు కానున్న నూతన మంత్రివర్గం, ఇటీవలి కీలక నియామకాలు (సుప్రీంకోర్ట్టు చీఫ్ జస్టిస్, సైన్యాధ్యక్షుడు), బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు (నూతన బ్యాంకింగ్ లైసెన్సులకు సంబంధించి బిమల్ జలాన్ నివేదిక, నాచికెట్మోర్ కమిటీ నివేదిక), ఆర్థిక రంగంలో మార్పులు, అంతర్జాతీయ పరిణామాలు (ఉక్రేయిన్ అంశం..), ముఖ్య క్రీడా వార్తలు-రికార్డులు (ఇటీవలి ట్వంటీ-20 ప్రపంచ కప్, ఐపీఎల్)...
- ఇంగ్లీష్లో కేవలం గ్రామర్ నిబంధనలు నేర్చుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదు. సందర్భోచితంగా అర్థం చేసుకోగలిగే నైపుణ్యం ఉండాలి. అది పెరగాలంటే నిత్యం ఆంగ్ల దినపత్రికలను చదవాలి.

Advertisements

No comments:

Followers