Advertisements

July 12, 2014

UPSC ప్రిలిమ్స్‌లో విజయం కోసం............

దేశంలో అత్యున్నత పోటీ పరీక్ష సివిల్స్. ఇది ఉన్నత ఉద్యోగాల వేదిక. దీనిలో విజయం సాధించాలంటే ప్రిలిమ్స్ అనే మొదటి అంకంలో విజయం సాధించాలి. ఇది తొలి, ప్రధాన ఘట్టం. ప్రిలిమ్స్లో విజయం సొంతం కావడానికి ఏం చేయాలి అన్న అంశంపై నిపుణుల సూచనలు నేటి ప్రత్యేకం.. 


భారతదేశ పాలనా యంత్రాంగంలోని అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల ఎంపికలో మొదటి ఘట్టం, అత్యంత కఠినమైన పరీక్ష ప్రిలిమ్స్. దీనిలో విజయం సాధించాలంటే నూతన వ్యూహాన్ని అవలంభించాలి.  ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలంటే మొదటగా చేయాల్సిన పని గత ప్రశ్నపత్రాలను విభాగాలు, టాపిక్ వారీగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తయినవారు మోడల్పేపర్స్ను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. ఇక ప్రిపరేషన్ పూర్తికాని వారు మిగిలిన సమయాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకొనేందుకు ప్రయత్నించాలి. నిజానికి ప్రిలిమ్స్ ఒక సముద్రం లాంటిది. అయితే కొన్ని టెక్నిక్స్ ఆధారంగా పరీక్ష కొణంలో అతిముఖ్యమైన వాటిని గుర్తించి వాటికి సంబంధించిన ప్రాథమికాంశాలను మొదలు వర్తమాన కాలంలో వాటి అనువర్తనాలను కూడా తెలుసుకోగలిగితే 60 శాతం మార్కులు పొందవచ్చు.


సిలబస్ను అర్థం చేసుకోవాలి:
సివిల్స్ ప్రిలిమ్స్ సిలబస్లో పేర్కొన్న విభాగాలను మొదట స్థూలంగా అర్థం చేసుకోవాలి. అనంతరం వాటి పరిధిని సూక్ష్మంగా అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత విభాగం అంశం నుంచి ప్రశ్న విధంగా అడిగినప్పటికీ సులభంగా సమాధానాన్ని గుర్తించవచ్చు. 

సిలబస్లోని అంశాలు:
1.అంతర్జాతీయ, జాతీయ ప్రాముఖ్యత గల వర్తమాన అంశాలు(కరెంట్ ఈవెంట్స్)

2.భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం
3.భారతదేశ, ప్రపంచ భౌగోళిక శాస్త్రం, భౌతిక, సామాజిక, ఆర్థికపరమైన అంశాలు
4.ఇండియన్ పాలిటీ, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ హక్కులకు సంబంధించిన అంశాలు
5.ఆర్థిక, సామాజిక అభివద్ధి - సుస్థిరాభివద్ధి, పేదరికం, సమ్మిళిత, జనాభా సంబంధిత అంశాలు
6.పర్యావరణ ఆవరణ శాస్త్రం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులకు సంబంధించిన సాధారణ అంశాలు
7.జనరల్ సైన్స్


వెయిటేజ్ కీలకం:
సివిల్స్ ప్రిలిమ్స్లో పేపర్-1 జనరల్ స్టడీస్లో 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు, సమయం రెండు గంటలు. ప్రతి తప్పుకు 1/3వంతు నెగిటివ్ మార్కులు ఉన్నందున 100 ప్రశ్నలకు జవాబులను గుర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్న పత్రం కఠినంగా ఉంటుంది. కాబట్టి పేపర్-1లో సగటున 60 ప్రశ్నలకు(120 మార్కులు) గుర్తించి, రెండోపేపర్లో 50 ప్రశ్నలకు (50 X 2 1/2= 125) కచ్చితమైన సమాధానాలను గుర్తించగలిగి మిగతా వాటిలో మరో ఐదు నుంచి పది ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్ కాగలిగితే ప్రిలిమ్స్లో విజయం సాధించినట్లే. అందువల్ల 100 శాతం మార్కులు రావాలన్న భావనను వదిలేసి ప్రతి సబ్జెక్టులో తరుచుగా ప్రశ్నలు వస్తున్న విభాగాలను, అంశాలను గుర్తించి(గత ప్రశ్న పత్రాల ఆధారంగా) ప్రిపరేషన్ కొనసాగించాలి.

విభాగం ప్రశ్నల సంఖ్య(సుమారుగా)
1. కరెంట్ ఈవెంట్స్ 8-12

2. భారతదేశ చరిత్ర, 14 -18 స్వాతంత్రోద్యమం
3. జాగ్రఫీ 15 -20
4. పాలిటీ అండ్ గవర్నెన్స్ 12 -16
5. ఎకానమీ 14 -20
6. ఆవరణం, జీవవైవిధ్యం 10 -13
7. జనరల్ సైన్స్ 25 -30


జనరల్ సైన్స్, ఆవరణ శాస్త్రం, జీవవైవిధ్యం:
ప్రిలిమ్స్లో విభాగాల నుంచి సగటున 40 ప్రశ్నలు వస్తున్నందున అభ్యర్థులు వీటికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. సైన్స్ అకడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు ఇందులో అత్యధిక మార్కులు సంపాదించుకోవాలి. ఇక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ గల అభ్యర్థులు కూడా సైన్స్కు సంబంధించిన ప్రాథమిక స్థాయి పుస్తకాలను చదివి బేసిక్ కాన్సెప్ట్స్ను డెవలప్చేసుకోవాలి. సైన్స్కు సంబంధించిన ప్రశ్నల్లో అత్యధికం అనువర్తనాలకు సంబంధించినవే ఉంటున్నాయి. కాబట్టి ప్రతి అంశం మౌలిక సూత్రం, దాని ఉపయోగం తెలుసుకోగలిగితే చాలా వరకు ప్రిపరేషన్ పూర్తయినట్లే. 

జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లోని అత్యంత కీలకమైన అంశాలను గుర్తించి, నిత్యజీవితంలో సైన్స్ ఉపయోగపడుతున్న తీరును అర్థం చేసుకోవాలి.


ఉదాహరణలు:


1.In human body which one of the following hormones regulates blood calcium and phospate? (c)
a) Glucagon b) Growth hormone
c) Para thyroid hormone d) Thyroxine
2.Assertion(A): Coal based thermal power stations contribute to acid rain
Reason(R): Oxides of carbon are emitted when coal burns (b)
a) Both A and R are true and R is the correct explnation of A 

b) Both A and R are true but R is not the correct explanation of A

c) A is true but R is false d) A is false but R is true



జాగ్రఫీ
విభాగం నుంచి వచ్చే ప్రశ్నల్లో అత్యధికంగా వనరుల లభ్యత, ప్రకతి వైపరీత్యాలు, శీతోష్ణస్థితికి సంబంధించిన అంశాలకు చెందినవి ఉంటాయి. కాబట్టి వీటిపై ప్రత్యేకంగా దష్టి సారించాలి. జాగ్రఫీని అర్థం చేసుకోవాలంటే మొదట అట్లస్పై అవగాహన పెంచుకోవాలి. ఇక ప్రాథమిక సూత్రాలు కాలానుగుణంగా రుతువుల్లో సంభవించే మార్పులు, ఖనిజ వనరులు, వాటి ఆధారంగా జరిగే పారిశ్రామికీకరణ, భూ, జల వనరులు, వాటి ఆధారంగా వ్యవసాయం, అనుబంధ రంగాల వికాసం తదితర అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి.

జాగ్రఫీలో ప్రపంచ పరిస్థితులకు భారతదేశ పరిస్థితులకు గల సంబంధాన్ని అర్థ చేసుకోగలిగితే కఠినమైన ప్రశ్నలకు కూడా సులభంగానే సమాధానాన్ని గుర్తించవచ్చు. భారతదేశ భౌగోళిక అంశాల గురించి లోతైన సమాచారాన్ని కలిగి ఉండాలి.


ఉదాహరణ:
1.which one of the following factors is resposible for the change in the regular direction of the ocean currents in the Indian ocean? [ ] 

a) Indian ocean is half an ocean
b) Indian ocean has monsoon drift
c) Indian ocean is a land-locked ocean
d) Indian ocean has greater vasiaction in salinity
2.which one of the following does not border panama? [ ]
a) coast Rica b) pacific ocean
c) colombia d) venezuela


ఎకానమీ

ఎకానమీకి సంబంధించిన ప్రశ్నల్లో ఎక్కువగా కరెంట్ ఎకానమీకి చెందినవి ఉంటాయి. ముఖ్యంగా మధ్య విడుదల చేసిన ఎకనామిక్ సర్వే, బడ్జెట్, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యవిధానం, ఆర్థిక సంబంధమైన బిల్లులు, చట్టాలు, వివిధ కమిటీలు, కమిషన్లు, వాటి సిఫారసులు, వివిధ దేశాలతో ఆర్థిక లావాదేవీలు, జనాభా సంబంధిత అంశాలు, వ్యవసాయం, పారిశ్రామిక సేవా రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు ప్రణాళికలు, ఆర్థిక సంఘం, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటి ప్రముఖ సంస్థల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
ఉదాహరణ:
1. with reference to the steel Industry in India in the recent times consider the following statements
i) Vizag steel plant (RINL) has been declared Mini Ratna
ii) Merger of IISCO with SAIL has bee completed which of the statements given above is / are correct [ c ] 
a) 1 only b) 2 only c) Both 1 and 2 d) Neither 1 or 2
2. Global capital flows to developing countries increased significanly during nineties. In view of the East Asian Financial Crisis and Latin American Experience. Which type of inflow is good for the host country? [ b ] 
a) Commercial loans 
b) Foreign Direct Investment 

c) Foreign Portfolio Investment

d) External Commercial Borrowings



చరిత్ర
భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాచీన, మధ్య యుగాల చరిత్ర కన్నా ఆధునిక భారతదేశ చరిత్ర పరీక్ష కోణంలో అత్యంత కీలకమైనది. అందువల్ల ఎక్కువ సమయాన్ని దీనికి కేటాయించాలి. ప్రాచీన మధ్య యుగాల్లో సాంఘిక, సాంస్కతిక, మతపరమైన ఉద్యమాలు, సంస్కరణలు, సామాజిక ఆర్థిక జీవనం ముఖ్యమైనవి. ఇక భారత స్వాతంత్య్రోద్యమంలోని వివిధ దశలు, నాయకుల పాత్ర, చట్టాలు, యుద్ధాలు, ఒప్పందాలు, పరిపాలనా పరమైన సంస్కరణలు, దేశ విభజన, రాజ్యాంగ రచన వంటి అంశాలకు కూడా చరిత్రలో భాగంగా అడుగుతున్నారు.

ఉదాహరణ:
1. Arekantavada is a core theory and philosophy of which one of the following? [ b ]
a) Buddhism b) Jainism 

c) Sikhism d) Vaishnavism

2. With which one of the following movements is the slogan DO or Die associated [ d ]
a) Swadeshi movement
b) Non-cooperation movement
c) Civil Disobedince movement
d) Quit India movement



పాలిటీ అండ్ గవర్నెన్స్
ఇండియన్ పాలిటీ, పాలనకు సంబంధించిన ప్రశ్నల్లో ఎక్కువగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, న్యాయస్థానాలు, తీర్పు లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య కాలంలో రూపొందించిన చట్టాలు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన సంస్కరణలు, సుపరిపాలన, ఎలక్ట్రానిక్ పరిపాలన-అనువర్తనాలు, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అంశాల నుంచి అడుగుతున్నారు. అవినీతి, నేరాలు - వాటి నివారణ యంత్రాంగాలు కాలానుగుణంగా వాటిలో వస్తున్న మార్పులు, సంస్కరణలు, ఎన్నికలు, ఎన్నికల సంస్కరణలు, భారత ప్రజాస్వామ్య బలాలు, బలహీనతలు, భారత- విదేశీ సంబంధాలు పరీక్ష కోణంలో ముఖ్యమైనవి.

ఉదాహరణ:
1. Which one of the following authorities recom mends the principles gover ning the grants-in-aid of the revenues to the states out of the consolidated fund of India.? [ a ]
a) Finance Commission b) Inter - state council
c) Union ministry of Finance
d) Public accounts committee
2. Who among the following was the chairman of the Union consittution committee of the Constituent Assembly? [ c ]
a) B.R Ambedkar b) J.B kripalani 

c) Jawaharlal Nehru d) Alladi Krishnaswami Ayyar



కరెంట్ ఈవెంట్స్
ప్రిలిమ్స్లో కరెంట్ ఈవెంట్స్ మిగతా విభాగాలతో అనుసంధానించి ఉంటాయి. పాలిటీ, ఎకానమీ, సైన్స్, జాగ్రఫీ సంబంధిత అంశాలల్లో గత సంవత్సర కాలంలో జరిగిన అత్యంత ప్రధానమైన అంశాలనే పరీక్షలో అడుగుతున్నారు. కాబట్టి కరెంట్ ఈవెంట్స్ చదివితే జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ పూర్తయినట్లే. లేకపోతే ప్రతి విభాగంలో కేవలం 50 శాతం ప్రశ్నలకే సరైన సమాధానాలను గుర్తించగలుగుతారు. కరెంట్ ఈవెంట్స్ను చదివేటప్పుడు అది జనరల్ స్టడీస్లోని విభాగంతో సంబంధం కలిగి ఉందో గుర్తించి దానికి అనుసంధానిస్తూ చదువుకోగలిగితే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు.

ఒత్తిడిని అధిగమించాలి..

పరీక్ష సమయం దగ్గరపడే కొద్దీ అభ్యర్థులు ఆందోళనకు గురవుతారు. అయితే సమయంలో మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే కొన్నేళ్లుగా చదివిన విషయాలు కూడా ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడంలో దోహదపడతాయి. ఇప్పటి వరకు చదివిన విషయాలను అవసరాన్ని బట్టి అనుసంధానించుకోవాలి. నిజానికి మొత్తం ప్రశ్నలలో 30 - 40 శాతం ప్రశ్నలు పరీక్ష కేంద్రంలో అభ్యర్థి మానసిక సామర్ధ్యంతోనే సమాధానాలను కనుగొనే విధంగా ఉంటాయి. ప్రిలిమ్స్లో విజయం సాధించాలంటే విషయ పరిజ్ఞానంతోపాటు సమయస్ఫూర్తి, వేగంగా స్పందించే గుణం, తార్కికంగా ఆలోచించే శక్తి, వర్తమాన అంశాలపట్ల అవగాహన పెంచుకోవాలి. అయితే ఇవన్నీ మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే సాధ్యమవుతాయని గుర్తుంచుకోవాలి.

Advertisements

No comments:

Followers