Advertisements

January 16, 2015

Bi - Fi and Nano Medicine

Bi -Fi
ఎం- 13 అనే వైరస్‌లో ఉండే కీలక గుణాల ఆధారంగా స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కణం నుంచి మరో కణానికి జన్యు సమాచారాన్ని పంపే విధంగా తొలిసారి Bi -Fi అనే యంత్రాంగం లేదా ఇంటర్నెట్ సష్టించారు. 
-కణాల మధ్య సంభవించే సంక్లిష్టమైన సమాచారం సరఫరావ్యవస్థతో పాటు వివిధ సముదాయాల మధ్య నెలకొన్న జీవరసాయన ప్రతిచర్యలపై గొప్ప నియంత్రణ వ్యవస్థలను కణాలు ప్రదర్శిస్తుంటాయి.
-ఎం -13 వైరస్ జన్యు సందేశాల పుట్ట డీఎన్‌ఏ పోగుల సాయంతో అతిథేయి శరీరంలో పునరుత్పత్తి జరుపుతుంది. 
- ఎం -13 ఆధారిత వ్యవస్థ ప్రధానంగా ఒక సమాచార మాధ్యమం ఒక వైర్‌లెస్ ఇంటర్‌నెట్ కనెక్షన్‌లాగా పనిచేస్తూ కణాలు సందేశాలను పొందడం లేదా పంపడం జరుగుతుంటుంది. కానీ పంపబడుతున్న సందేశాల్లో ఎటువంటి సమాచారం ఉందన్న సంగతి వాటికి తెలియదు.



నానో మెడిసిన్స్..
తొలి దశలోనే క్యాన్సర్‌ను నిర్ధారించడంతోపాటు, కేన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి ఔషధ సరఫరా, బయో మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషనల్, శస్త్రచికిత్స, మధుమేహవ్యాధి పర్యవేక్షణ, ఆరోగ్య సంరక్షణలో నానో రోబోటిక్స్ బిటెక్స్ వైద్యశాస్త్రరంగంలో ఉపయోగపడుతుంది. 
- దాదాపు 10 మి.మీ. పరిమాణం ఉండే ఆర్‌ఎన్‌ఏ పోగులను జతపరిచన నానో కణాలతో కీమోథెరపీ ఔషధాన్ని నింపి హార్వార్డ్ ఎమ్‌ఐఎటీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఏ విధంగా ఆర్‌ఎన్‌ఏ పోగులు కేన్సర్ కణాలను గుర్తించి దాడిచేసి కేన్సర్ కణాల్లోకి డ్రగ్‌ను విడుదల చేస్తాయి.

Advertisements

No comments:

Followers