స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలనుకునే వారికి అనేక సందేహాలు, సంశయాలు ఎదురవుతాయి, వాటిని నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కొన్ని సంస్థలు సహకరిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి...
రాజీవ్ గాంధీ ఉద్యమి మిత్ర పథకం(RGUMI)
ఔత్సాహికులకు ఎదురయ్యే ఇబ్బందులను భారత ప్రభుత్వం గమనించి కేంద్ర ప్రభుత్వసంస్థ అయిన చిన్న తరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ ఉద్యమి మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వయంఉపాధి రంగంలో రాణించాలనుకునే మొదటి తరం ఔత్సాహికులకు వరప్రదాయిని రాజీవ్‌గాంధీ ఉద్యమి మిత్ర పథకం. ఐటీఐ పూర్తి చేసిన లేదా ఏదేని స్వయంఉపాధి శిక్షణ పొందిన వారు, ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ పథకంలో చిన్న తరహా పరిశ్రమ స్థాపనలో ఎదురయ్యే విధానపరమైన అడ్డంకులను అధిగమించేందుకు సహాయపడుతుంది.
స్వయంఉపాధి పొందాలనుకునే ఔత్సాహికులకు పరిశ్రమ ఎంచుకోవడంలో సహాయపడటం, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వివిధ అనుమతులు, బ్యాంకు రుణానికి సంబంధించిన సమాచారం, వివిధ ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల గురించి, పరిశ్రమ స్థాపనకు అవసరమయ్యే స్థలం, భవన నిర్మాణ విషయంపై సూచనలు, మెషీనరీ ఎంపిక, ముడిసరుకు కొనుగోలు, మార్కెటింగ్ మెలకువలు, పరిశ్రమకు కావలసిన వెబ్‌సైట్ మొదలగు విషయాలపై సంపూర్ణ సహకారం అందిస్తుంది. అంతే కాకుండా పరిశ్రమ ఆరంభమైన 6 నెలల వరకు పర్యవేక్షిస్తుంది. పరిశ్రమ విజయవంతంగా నడుపుకోవడంలో సహాయ పడుతుంది.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఉద్యమి మిత్ర పథకాన్ని అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తున్నాయి. మరింత సమాచారం కొరకు 7032787807 ఫోన్ నంబర్‌పై తెలుసుకోవచ్చు.
RSETI NIRD
గ్రామీణ భారతంలో సరైన ఉద్యోగ అవకాశాలు లేక, దిశా నిర్దేశం చేసేవారు లేక యువత తీవ్ర నైరాశ్యం లో ఉంది. దీనిని రూపుమాపి వారిని స్వయంఉపాధి దిశలో ప్రోత్సహించడానికి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (NIRD) ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, జాతీయ బ్యాంకులతో కలసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (RSETI)ను ఏర్పాటు చేసింది. దీని శాఖ లు దాదాపు అన్ని జిల్లాల్లోని ముఖ్య కేంద్రాలలో ఉన్నా యి. యువతను ప్రధానంగా సూక్ష్మ, కుటీర తరహా పరిశ్రమలను నెలకొల్పడంలో స్వ ల్పకాలిక శిక్షణ, రుణం పొం దడంలో తోడ్పాటును అందిస్తుంది. శిక్షణకు ఎంపికైన ఔత్సాహికులకు శిక్షణ, భోజనం, వసతి ఉచితంగా ఇస్తారు.
సంస్థ చేపట్టే కార్యక్రమాలు:
-గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అర్హులైన యువతను గుర్తించి వారికి దిశా నిర్దేశం చేయడం.
-ప్రాంతాల వారీగా ఆ ప్రాంతానికి అనువైన వ్యాపా ర అవకాశాలను గుర్తించడం.
-యువతకు వ్యక్తిగత కౌన్సెలింగ్ నిర్వహించి వారికి అనువైన స్వయం ఉపాధి శిక్షణను సూచించడం, శిక్షణను అందించడం.
-శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకు రుణం పొందడంలో సహాయపడటం.
-వ్యాపారం నెలకొల్పిన ఔత్సాహికులకు కనీసం రెండేళ్లు మార్గనిర్దేశం వహిస్తుంది.
పూర్తి వివరాలకు 040-24008454 ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా www.nird.org.in/rseti అనే వెబ్‌సైట్ చూడవచ్చు.
ఫ్యాప్సీ(FAPCCI):
చాంబర్ ఆఫ్ కామర్స్ 1917లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడింది. తరువాత 1958లో (FAPCCI) (ఫ్యాప్సీ)గా రూపాంతరం చెందింది. ఫ్యాప్సీ ప్రధానంగా పారిశ్రామిక, వ్యాపారవేత్తల సముదాయం. పరిశ్రమలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. పరిశ్రమల ప్రయోజనాలు కాపాడటం, ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఆంధించడం, ప్రధానమైన పాలసీల రూపకల్పనలో ప్రధానమైన భూమికను పోషిస్తుంది.
సంస్థ ఉద్దేశాలు:
-పరిశ్రమను స్థాపించాలనుకునే ఔత్సాహికులకు తగిన సూచనలు, సలహాలు అందించడం
-పరిశ్రమలకు సంబంధించిన పూర్తి సమాచారం, సహకారం అందిస్తుంది.
-వ్యాపారం లేదా పరిశ్రమ విస్తరణ, అభివృద్ధి పథకాలకు తగిన సూచనలు, సలహాలు అందించడం
-దేశీయంగా, అంతర్జాతీయంగా సంబంధిత ఎగ్జిబిషన్స్, సెమినార్స్ నిర్వహించడం, ఫ్యాప్సీ సభ్యులను పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తుంది.
ఫ్యాప్సీ ప్రధానమైన విశేషాంశం ఈ సంస్థలో పారిశ్రామిక వేత్తలే కాకుండా అనేక వర్తక, పారిశ్రామిక సంఘాలు సభ్యులుగా ఉన్నారు, ప్రస్తుతం శివ్ కుమార్ rungta అధ్యక్షుడిగా ఉన్నారు.
పూర్తి వివరాలకు 040-23395515 ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా www.fapcci.in అనే వెబ్‌సైట్ చూడవచ్చు.
FICCI లేడీస్ ఆర్గనైజేషన్(FLO):
FLO మహిళా సాధికారత లక్ష్యంగా 1983లో ఆవిర్భవించింది. ఈ సంస్థ FICCI కి అనుబంధ సంస్థ, మూడు దశాబ్దాల ప్రస్థానంలో 10 శాఖలతో 3200 మంది సభ్యులతో భారతదేశమంతా విస్తరించింది. ఔత్సాహిక మహిళలకు పూర్తిస్థాయి సేవలు అందిస్తుంది.
సంస్థ చేసే పనులు:
-ఔత్సాహిక మహిళలకు మార్గనిర్దేశం చేయడం
-మహిళలకు బ్యాంకర్లకు మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించడం
-వ్యాపార నిర్వహణకు కావలసిన పూర్తి సమాచారం, సహకారం అందిస్తుంది.
-ఔత్సాహిక మహిళలకు వ్యాపారం లేదా పరిశ్రమ విస్తరణ, అభివృద్ధి పథకాలకు కార్యాచరణను తయారు చేస్తుంది.
-వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్స్, సెమినార్స్ నిర్వహించడం.
పూర్తి వివరాలను 040-65811068 ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు.
FISME- ఫిస్మే :
చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య - ఫిస్మేను 1995 లో స్థాపించారు. దేశవ్యాప్తంగా అనేక శాఖలను కలిగి ఉన్న ఫిస్మే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉంది, అంతే కాకుండా పరిశ్రమ వర్గాల కోసం అనేక పుస్తకాలు, వ్యాసాలను ప్రచురిస్తుంది.
ఫిస్మే కార్యక్రమాలు:
-దేశవ్యాప్తంగా ఔత్సాహికులను పరిశ్రమలు స్థాపించే విధంగా ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం.
-ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపార, పరిశ్రమలకు ఎగుమతి అవకాశాల అధ్యయనం, అనుసంధానం.
-ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని అనేక పరిశ్రమల సమాఖ్యలతో ఫిస్మే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. వివిధ దేశాల్లో ఫిస్మేకు ప్రతినిధులు ఉన్నారు, దీనివల్ల అనేక అవకాశాలను పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంటాయి.
-సంస్థ తరచుగా మన దేశంలోని అనేక నగరాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సెమినార్లు, స్టడీ టూర్లు నిర్వహిస్తుంది.
-ఔత్సాహికులకుతగిన సూచనలు, సలహాలు అందించడం.
Advertisements
No comments:
Post a Comment