-సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులున్నారు.
-సుప్రీంకోర్టు మొదటి న్యాయమూర్తి సర్ ఎలిజా యంఫే 1861 కౌన్సెల్ చట్టం ద్వారా మొదట కలకత్తా, తర్వాత మద్రాస్, బొంబాయిల్లో హైకోర్టులను ఏర్పాటు చేశారు.
-1886లో అలహాబాద్‌లో హైకోర్టు నెలకొల్పారు.
-1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారా ఢిల్లీలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు.
-భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనవరి 28, 1950లో సుప్రీంకోర్టును ఢిల్లీలో ఏర్పాటు చేశారు.
-సుప్రీంకోర్టు ప్రారంభ సమావేశం పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ చాంబర్‌లో జరిగింది. సుప్రీంకోర్టు ప్రారంభంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు ఉన్నారు.
-సుప్రీంకోర్టు ప్రథమ న్యాయమూర్తి ఎచ్‌జే కానియా(హరిలాల్ జెకిసుండా కానియా)
-సుప్రీంకోర్టు న్యాయమూర్తులను 1956లో 11కు, 1960లో 145కు, 1977లో 18కు, 1986లో 26కు, 2008లో 31కి పెంచుతూ చట్టం చేశారు.
-సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను పెంచే అధికారం పార్లమెంట్ కు కలదు.
-ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు(హంద్యాల లక్ష్మీనారాయణ దత్తు)
-భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ప్రకరణ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు నిర్మాణం, అధికార విధులను గురించి పేర్కొన్నారు.
-124(2) ప్రకరణం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు.
-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తమ పదవుల్లో కొనసాగడానికి ఇష్టం లేనప్పుడు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు.
-సుప్రీంకోర్టు న్యాయమూర్తి సాధారణంగా ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. కానీ 1973లో జస్టిస్ ఎస్‌ఎం సిక్రీ పదవీ విరమణ చేసిన తర్వాత జేఎం షేలట్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్‌లను కాదని నాలుగో స్థానంలో ఉన్న ఏఎన్ రేను నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలోని మంత్రిమండలి సూచన మేరకు నాటి రాష్ట్రపతి వీవీ గిరి నియమించారు.
-1977లో కూడా హెచ్‌ఆర్ కన్నా తర్వాత సీనియార్టీలో రెండోస్థానంలో ఉన్న ఎంహెచ్ బేగ్‌ని ప్రధాన న్యాయమూర్తిగా ఇందిరాగాంధీ నేతృత్వంలోని మంత్రిమండలి సూచన మేరకు నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీఅహ్మద్‌ను నియామకం చేశారు. ఈ రెండు సందర్భాల్లో తప్ప మిగతా ప్రధాన న్యాయమూర్తులను సీనియార్టీ ప్రకారం నియమించారు.
సుప్రీంకోర్టు సీజే- అర్హతలు
-124(3) ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి కింది అర్హతలు ఉండాలి.
ఎ. భారతీయ పౌరుడై ఉండాలి.
బి. ఏదైనా కోర్టులో న్యాయమూర్తిగా 5 ఏళ్ల అనుభవం ఉండాలి లేదా
ఏదైనా హైకోర్టులో 10 ఏళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
సి. 65 ఏళ్లు నిండి ఉండరాదు.
డి. రాష్ట్రపతి దృష్టిలో న్యాయశాస్త్రంలో నిష్ణాతుడై ఉండాలి
న్యాయమూర్తుల వేతనాలు(రూపాయల్లో)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - 1,00,000
సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి - 90,000
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - 90,000
హైకోర్టు సాధారణ న్యాయమూర్తి - 80,000
న్యాయమూర్తులకు వేతనంతో పాటు ఉచిత నివాసం. ఇతర
సౌకర్యాలు, పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది.
-న్యాయమూర్తులకు వేతనాలను పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తారు. వీరి వేతనాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
-అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సందర్భాల్లో వీరి వేతనాలను తగ్గించడానికి వీలులేదు.
-న్యాయమూర్తుల జీత భత్యాలను గురించి రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
-ప్రకరణం 126 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఖాళీ ఏర్పడినప్పుడు లేదా అనివార్య కారణాలవల్ల తన విధులను నిర్వర్తించలేని పక్షంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు
-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.
-సుప్రీంకోర్టు జడ్జీలను అసమర్ధత, దుష్ప్రవర్తన కారణాలతో రాష్ట్రపతి పదవి నుంచి వారిని తొలగిస్తాడు.
-న్యాయమూర్తులను తొలగించడానికి లోక్‌సభ అయితే తొలగించే తీర్మానం నోట్‌పై 100 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్‌కు లేదా రాజ్యసభ చైర్మన్‌కు నోటీస్ ఇవ్వాలి. న్యాయమూర్తులపై వచ్చే ఆరోపణలను ధ్రువీకరిస్తూ పార్లమెంట్ ఉభయ సభ్యులు వేర్వేరుగా 2/3 వంతు మెజార్టీతో తీర్మానించిన తర్వాత వారిని పదవి నుంచి తొలగించాలి.
-పంజాబ్-హర్యానా కోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తమిళనాడుకు చెందిన వీ రామస్వామిపై మహాభియోగ తీర్మానం ప్రతిపాదించారు. భారతదేశచరిత్రలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఇలాంటి తీర్మానం ప్రతిపాదించినప్పటికీ పార్లమెంట్‌కు కాంగ్రెస్ గైర్హాజరు కావడంతో ఇది వీగిపోయింది. ప్రస్తుతం జస్ట్టిస్ సౌమిత్ర సేన్, జస్టిస్ దినకర్‌లపై అభిశంసన ప్రక్రియ కొనసాగుతోంది.
సుప్రీంకోర్టు అధికారాలు
ప్రారంభ అధికారాలు: రాజ్యాంగంలోని 131 ప్రకరణ సుప్రీంకోర్టు ఒరిజినల్ లేదా ప్రారంభ అధికారాలను తెలుపుతుంది. అంటే సుప్రీంకోర్టు పరిధిలో మాత్రమే విచారించే కేసులు కేంద్రం రాష్ర్టాలు, వివిధ రాష్ర్టాల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టు విచారించి తీర్పులిస్తుంది. వీటిని ప్రారంభ అధికారాలంటారు.
పునర్విచారణ అధికారం : మనదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కావడంతో హైకోర్టుల నుంచి వచ్చే అప్పీళ్లను పరిశీలిస్తుంది. ఇవి సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధమైనవి కావచ్చు.
సలహా అధికార పరిధి : రాష్ట్రపతి సుప్రీంకోర్టును 143(1) ప్రకారం సలహాలు అడగొచ్చు. తన సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదు. ఇంతవరకు రాష్ట్రపతి 14 అంశాలకు సంబంధించిన వివాదాల్లో సుప్రీంకోర్టు సలహాలను కోరారు. మొదటిసారిగా 1951లో ఢిల్లీ న్యాయచట్టాలకు సంబంధించినది. చివరగా 2006లో లాభదాయక పదవులను గురించి రాష్ట్రపతి సలహాను కోరారు.
కోర్ట్ ఆఫ్ రికార్డ్
సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో తాను ఇచ్చిన తీర్పులను భద్రపరచడాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. ఒకసారి కోర్టు రికార్డుల్లోకి వెళ్లిన అంశాన్ని చట్టంతో సమానంగా భావిస్తారు.
ప్రాథమిక హక్కుల పరిరక్షణ : 32 అధికరణం కింద సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన సందర్భంలో ఐదు రకాల రిట్లను సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. అవి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్ కోవారంటో, సెర్షియోరరీ
సుప్రీంకోర్టు తీర్పులు
గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ స్టేట్ : 1967(జస్టిస్ కోకా సుబ్బారావు) రాజ్యాంగంలో గుర్తించిన ప్రాథమిక హక్కులను కుదించేందుకు లేదా సవరించేందుకు పార్లమెంట్‌కు అధికారం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది.
కేశవానంద భారతి వర్సెస్ కేరళ : 1973(జస్టిస్ ఎస్‌ఎం సిక్రీ) రాజ్యాంగ మౌలిక స్వరూపం తప్ప ఏ అంశాన్నైనా మార్చే అధికారం పార్లమెంట్‌కు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
మినర్వామిల్స్ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం 1980: (జస్టిస్ వైవీ చంద్రచూడ్) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పరం విరుద్ధమైనవి కావని ఇవి ఉమ్మడిగా సామాజిక విప్లవానికి ప్రతీక కావున ఒకదానిపై ఒకటి ఆధిపత్యం కొనసాగించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమబెంగాల్ 1954 : (జస్టిస్ ఎం. పతంజలి) ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను సమాజ పరం చేసే సందర్భంలో వారికి నష్టపరిహారంగా న్యాయబద్ధంగా చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
నీరజా చౌదరి కేసు-1984 : జీవించే హక్కుకు వెట్టిచాకిరి భంగం కలిగిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఉన్నికృష్ణన్ కేసు-1993 : విద్యా హక్కు కూడా ప్రాథమిక హక్కు అయినప్పటికీ అది జీవించే హక్కులో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
సరళ మద్గల్ కేసు-1995 : హిందూ మతచట్టం ప్రకారం పెళ్లి చేసుకొని మరో పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మతం స్వీకరించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఎస్‌ఆర్ బొమ్మాయ్ కేసు-1995 : సమాఖ్య విధానం రాజ్యాంగ మౌలిక విధానంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఇంద్రసహాని వర్సెర్ భారత ప్రభుత్వం -1992 : ఓబీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ సంక్షేమ, స్వభావం, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు తెలిపింది.
ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా : తాజ్‌మహాల్ చుట్టూ ఉన్న కాలుష్యాన్ని వెదజల్లే 18 పరిశ్రమలను మూసివేయాలని తీర్పు నిచ్చింది.
ప్రధాన న్యాయమూర్తులు- ప్రత్యేతలు
-సుప్రీంకోర్టు మొదటి న్యాయమూర్తి హెచ్‌జే కానియా(హరిలాల్ జెకిసుండా కానియా)
-సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు (హంద్యాల లక్ష్మీనారాయణ దత్తు)
-సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం పని చేసిన ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్(7 ఏళ్ల 140 రోజులు)
-సుప్రీంకోర్టులో తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి కే నాగేంద్రసింగ్ (17 రోజులు)
-దేశంలో తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్
-3వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎంసీ మహాజన్ జమ్ము కశ్మీర్ ప్రధానమంత్రిగా అక్టోబర్ 15, 1947 నుంచి మార్చి 5, 1948 వరకు పనిచేశారు.
-ఎక్కువమంది ప్రధాన న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం.(కేజీ బాలకృష్ణన్, ఆర్‌సీ లహోటీ, వీఎన్ ఖారే, వైకే సభర్వాల్, జీబీ పట్నాయక్, ఎస్ రాజేంద్రబాబు)
-జస్టిస్ మహ్మద్ హిదాయితుల్లా యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా జూలై 20, 1969 నుంచి ఆగస్ట్ 24, 1969 వరకు పని చేశారు. ఉపరాష్ట్రపతిగా 1979-84 వరకు పనిచేశారు.
-జస్టీస్ ఆర్‌ఎస్ పాథక్ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పని చేశారు.
-మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ ఎన్ వెంకటాచలయ్య, జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ ఏఎన్ ఆనంద్, జస్టిస్ రాజేంద్రబాబు, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పని చేశారు.
-జస్టిస్ గజేందర్ గడ్కర్. జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ ఖర్మ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు.
-జస్టిస్ జేఎస్ వర్మ ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం ఉదంతంపై విచారణ కమిటీ కొరకు త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.
-రాజ్యాంగ సమీక్ష కమిషన్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన ఫిబ్రవరి 23, 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
-జస్టిస్ పీఎన్ భగవతి కాలంలో భారత న్యాయ వ్యవస్థలో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం ప్రవేశపెట్టారు.
-జస్టిస్ సదాశివం ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా పని చేస్తున్నారు. (నియామకం ఆగస్ట్ 31, 2014)
Advertisements
No comments:
Post a Comment