Advertisements

May 10, 2014

Will New Governments Take Up Recruitment in 2014?? News Dated: 10/05/2014

APPSC NEW NOTIFICATIONS DATES FOR EXAMS AND STATUS, SETUP OF TELANGANA PUBLIC SERVICE COMMISSION, APPSC Notifications, APPSC Group 1 Notification, Appsc 2014 Notifications, Jobs and Results Source: Eenadu
APPSC NEW NOTIFICATIONS DATES FOR EXAMS AND STATUS, SETUP OF TELANGANA PUBLIC SERVICE COMMISSION, APPSC Notifications, APPSC Group 1 Notification, Appsc 2014 Notifications, Jobs and Results Source: Eenadu

Advertisements

May 6, 2014

Linguistic States of India (TM)

కొత్త రాష్ర్టాల ఏర్పాటు, రాష్ర్టాల చేరిక వంటి విషయాలు భారత రాజ్యాంగంలోని ఒకటో భాగంలో ప్రకరణ 1 నుంచి 4 వరకు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఒకటో నిబంధనలో భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్ (యూనియన్ ఆఫ్ స్టేట్స్)గా పేర్కొన్నారు. సమాఖ్య (ఫెడరేషన్) అని ఎక్కడా పేర్కొనలేదు. భారత భూభాగంలో రాష్ర్టాలు, కేంద్రపాలితప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆర్జించిన ప్రాంతాలు ఉంటాయి. ప్రాదేశిక జలాలు, భారత అంతరిక్ష సరిహద్దులు కూడా ఉంటాయి. ఈ అన్ని అంశాలకు భారత సార్వభౌమత్వం వర్తిస్తుంది.

రెండో ప్రకరణ ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా కొత్త ప్రాంతాలను చేర్చుకోవచ్చు. ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు. అదేవిధంగా కొత్త రాష్ర్టాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, పేర్లను మార్చే అంశాలను మూడో ప్రకరణలో పేర్కొన్నారు. ఇందులో కింది అంశాలుంటాయి.
-ఒక రాష్ట్రం నుంచి మరొక కొత్త రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడం
-డు లేదా మూడు రాష్ర్టాలను కలిపి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం
-రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం, తగ్గించడం 
-రాష్ర్టాల సరిహద్దులను మార్చడం
-రాష్ర్టాల పేర్లను మార్చడం

Linguistic States of India polity for appsc group 1 upsc ias notes material

రాష్ర్టాల ఏర్పాటు - సరిహద్దుల మార్పు


మూడో ప్రకరణలో పేర్కొన్న అన్ని అంశాలకు ఒకే ప్రక్రియ ఉంటుంది. వాటికి సంబంధించిన బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. దీనికోసం రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. కాగా, పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టేముందు దానికి సంబంధించిన రాష్ట్ర శాసన సభల అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరుతారు. ఆ శాసనసభలు వ్యక్తంచేసిన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. ఈ బిల్లులను పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తుంది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. 

Advertisements

May 3, 2014

Hydrogen & its Isotopes - Some properties

హైడ్రోజన్‌ను కావెండిష్ ఆవిష్కరించగా, ఎలావోయిసియెర్ పేరు పెట్టారు. న్యూట్రాన్లు లేకుండా లభించే ఏకైక మూలకం ఇదే. ఇది విశ్వంలో పుష్కలంగా లభిస్తుంది.
-హైడ్రోజన్‌లో మూడు ఐసోటోప్‌లు ఉన్నాయి. ప్రోటియం, డ్యుటీరియం, ట్రిటియం. భారీ రెండు ఐసోటోపులు కేంద్రక సంలీన చర్యలో పాల్గొంటాయి. ట్రిటియం రేడియోధార్మిక ఐసోటోప్.

-హైడ్రోజన్ తటస్థ ఆక్సైడ్ అయినప్పటికీ అధిక విద్యుత్ స్థిరాంకం, ద్రవిత, హెచ్-బంధ ప్రవత్తి ఉంటాయి. అందువల్లే దీనిని సార్వత్రిక ద్రావణిగా పరిగణిస్తారు. పైగా దీనికిగల అధిక విశిష్టోష్ణం కారణంగా దీన్ని శీతిలకారిగా ఎక్కువగా ఉపయోగిస్తారు.

-భారజలం అనేది భార హైడ్రోజన్(డ్యుటీరియం) అక్సైడ్. దీని ఫార్ములా D2O. ఇది వేగంగా చలించే న్యూట్రాన్‌ల వడిని తగ్గిస్తుంది. అందువల్ల దీన్ని విద్యుదుత్పాదన కోసం కేంద్రక రియాక్టర్‌లో ఉపయోగిస్తారు.

-హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా ఆక్సిజనేటెడ్ నీటిని థెనార్డ్ ఆవిష్కరించారు. ఇది ఆక్సీకరణ, క్షయకరణ, బ్లీచింగ్ కారకంగా పనిచేస్తుంది. ఇది నల్లరంగు లెడ్ సల్ఫేట్‌ను తెలుపు లెడ్ సల్ఫేట్‌గా మారుస్తుంది. కాబట్టి సీసపు పెయింటింగ్‌ను తుడవడానికి దీన్ని ఉపయోగిస్తారు.


Hydrogen is the lightest element and its atomic number is 1. Hydrogen has one proton and one electron
Three naturally occurring isotopes of hydrogen exist: protium, deuterium, and tritium, each with different properties due to the change in the number of neutrons in the nucleus. Hydrogen-1 is sometimes called protium. It is the simplest and most common form of hydrogen.

Advertisements

Followers