Advertisements

February 4, 2014

సొంతనోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 సాధారణంగా పోటీపరీక్షలకు రెడిమేడ్ నోట్స్‌పైనే ఎక్కువ మంది అభ్యర్థులు ఆధారపడుతుంటారు. అయితే పరీక్షలకు సొంతంగా నోట్స్‌ని తయారుచేసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు. ఇలా సొంతనోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ : సాధారణంగా పోటీపరీక్షలకు సంబంధించి పోస్టుల సంఖ్య కేవలం వందల్లో (అరుదుగా వేయికిపైగా ఉంటాయి) ఉండగా వాటి కోసం పోటీపడే అభ్యర్థుల సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. సాధారణంగా ఏ పోటీ పరీక్షలలోనైనా పోటీ తీవ్రంగానే ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడమే అంతిమ లక్ష్యంగా సంవత్సరాల తరబడి నిద్రాహారాలు మానుకొని సీరియస్‌గా ప్రిపేరయ్యే అభ్యర్థులు 40 శాతం వరకు ఉంటారు. నిజానికి అంతిమ విజేతలలో వీరే ఎక్కువగా ఉంటారు. మిగతావారు నాన్‌సీరియస్ అభ్యర్థులే. అందువల్ల సీరియస్‌గా ప్రిపేరయ్యే అభ్యర్థులు అందరిమాదిరిగా మార్కెట్‌లో లభించే రెడీమేడ్ మెటీరియల్‌పై ఆధారపడితే అదృష్టం ఉంటేనే విజేత కావచ్చు లేకపోతే అందరికి వచ్చినన్ని మార్కులు వచ్చి, పరాజయులుగా మిగిలిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.ప్రతి పోటీ పరీక్షకు ప్రత్యేకమైన సిలబస్, ప్రత్యేకమైన ప్రిపరె న్స్ బుక్స్ ఉంటాయి. కాబటి, ప్రిపరేషన్‌లో కూడా ప్రత్యేకమైన వ్యూహాన్ని (Strategy) ఎంచుకోవాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల లో విజయం సాధించాలంటే తప్పనిసరిగా సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం మంచిది. దీనివల్ల సిలబస్‌పై పూర్తి అవగా హన ఏర్పడటమే కాకుండా, ప్రశ్నలు ఏ విధంగా వచ్చినా సులభం గా సమాధానాన్ని గుర్తించడం/రాయడం సాధ్యమవుతుంది.

సొంతంగా నోట్స్‌ను తయారుచేసుకునేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే విలువైన సమయం వృధా కావడమే కాకుండా విజయం సాధించలేకపోవచ్చు. సొంత నోట్స్ ప్రిపరేషన్‌లో మొదట సిలబస్‌ను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకొని, ఒకటి లేదా రెండు స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్‌ను ఎంపిక చేసుకొని ఆబ్జెక్టివ్ పరీక్ష అయితే పాయింట్ల రూపంలో, డిస్క్రిప్టివ్ పరీక్ష అయితే చిన్న చిన్న పేరాల రూపంలో ప్రతి అంశం గురించి తక్కువ పదాల్లో ఎక్కువ అర్థం వచ్చే మాదిరిగా గణాంకాలు. (Statistics) వాస్తవ అంశాలను (Facts) రాసుకోవాలి. అయితే ఆ పరీక్షకు సంబంధించిన గత ప్రశ్నా పత్రాలను అంశ ప్రాతిపదికన క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి సమాధానం అయితే వాటికి సరిపోతుందో అలాంటి సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో రాసుకోవాలి. దీనికి అదనంగా విలువ జోడించేందుకు గాను కరెంట్ అఫైర్స్‌లో సిలబస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కూడా తప్పనిసరి. నోట్స్ ప్రిపరేషన్‌లో కనపడ్డ ప్రతి బుక్‌ని రిఫర్ చేయకుండా స్వయం నియంత్రణ కూడా ఉండాలి. లేకపోతే అసలు లక్ష్యం నెరవేరదు.

సివిల్స్ నోట్స్ ప్రిపరేషన్‌లో ఎలాంటి మెళకువలు పాటించాలి?   మారిన సివిల్స్ పరీక్ష విధానంలో ప్రశ్నలన్నీ వర్తమాన వ్యవహారాలు, సమాజంలో, మీడియాలో చర్చకు వస్తున్న వివిధ అంశాలపై ఆధారపడి ఉంటున్నాయి. మెయిన్‌‌స జనరల్ స్టడీస్‌లోని నాలుగు పేపర్లు, ఎస్సే మొత్తం అదేవిధంగా ఉంటున్నాయి. పాఠ్యపుస్తకాలు, ఇతర మెటీరియల్ అన్నీ కూడా నోట్స్ రూపంలో ఉన్నవే. అయితే వివిధ దినపత్రికలు, మ్యాగజైన్లు, పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన అంశాలను సినాప్సిస్, బుల్లెట్ పాయింట్స్‌లా రాసుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో అప్‌డేట్ చేసుకుంటుండాలి. వీటిని వీలైనప్పుడు చదువుకోవడానికి అనుకూలంగా తయారు చేసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా వీటిని పదేపదే చదవాలి. ఇంటర్నెట్‌పై అతిగా ఆధారపడకూడదు. దీనివల్ల కాలయాపన అవుతుంది.

Advertisements

No comments:

Followers