Advertisements

February 4, 2014

ఎపిపియస్‌సి నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులు ఎప్పుడు విడుదల చేస్తుంది?

ఎపిపియస్‌సి నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులు ఎప్పుడు విడుదల చేస్తుంది. ఇంటర్వ్యూ ఉన్న వాటికి, లేని వాటికి ఏ పద్ధతి ఫాలో అవుతుంది. తెలియజేయండి.? - జ : ఎపిపియస్‌సి పరీక్షల నిర్వహణకు సంబంధించి 2012లో నూతన క్యాలెండర్ విధానాన్ని అనుసరించేందుకు మార్గదర్శకా లను రూపొందించుకుంది. అయితే వివిధ కారణాల వల్ల ఇది ఆచరణలోకి రాలేకపోయింది. సాధారణంగా డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉండే గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ప్రక్రియ పూర్తవడానికి కనీసం 8 నెలల సమయం పడుతుంది.(మూడు సంవత్సరాల పాటు ప్రక్రియ కొనసాగిన ఉదాహరణలు కూడా ఉన్నాయి). ఇక అబ్జెక్టివ్ విధానంలో ఇంటర్వ్యూ ఉండే లెక్చరర్స్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియకు 6 నెలల సమయం పడుతుంది. ఇంటర్వ్యూ లేకుండా కేవలం అబ్జెక్టివ్ విధానంలో మాత్రమే జరిగే పరీక్షల నిర్వహణ పూర్తవడానికి కనీసం నాలుగు నెలలు సమయం పట్టవచ్చు. మీరు పోటీ పరీక్షల సిలబస్, సమాచార సేకరణ, గత ప్రశ్నల పత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, గరిష్ట మార్కులు సంపాదించేందుకు శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేర్ కావడానికి గల అవకాశాలను అన్వేషించాలి. గమ్యం సవ్యంగా ఉంటే లక్ష్యం నేరవేరుతుంది. ప్రిపరేషన్ సమయంలో సమయాన్ని సమర్థ వంతంగా ఉపయోగించుకోవడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలి తప్ప మార్కులు ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశానికి తక్కువ ఆత్రుత ఉండాలి. నిజాయితీగా మిగతా అభ్యర్థుల కన్నా ఎక్కువగా కష్టపడ్డ అభ్యర్థిని విజయం తప్పనిసరిగా వరిస్తుంది. కష్టపడటం వరకే మీ బాధ్యత ఫలితం దానంతటతే వస్తుంది. ఇంటర్వ్యూ ఉండే పరీక్షల ప్రిపరేషన్ విషయంలో మొదటి నుండి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ సబ్జెక్టులలోని మౌలికాంశాలు (Fundamentals) జనరల్ స్టడీస్ పరంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలను తప్పనిసరిగా నిరంతరం అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

Advertisements

No comments:

Followers