How to prepare for current affairs and General Studies, Preparation tips and mistakes made by students while preparing for current affairs to various competitive exams. Civil service examination preparation tips in Telugu Medium.
అన్ని పోటీపరీక్షల్లో కరెంట్ ఎఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, గ్రూప్ పరీక్షలు తదితర వాటిల్లో జనరల్ స్టడీస్‌లో భాగంగా వర్తమాన సంఘటనలు ఉంటాయి. అదేవిధంగా బ్యాంక్ పీవోలు, క్లర్క్ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ విభాగానికి ప్రత్యేకించి ఒక పేపర్ ఉంటుంది. అయితే చాలామంది విద్యార్థులు కరెంట్ అఫైర్స్‌ను కేవలం వర్తమాన సంఘటనలకు పరిమితం అవుతూ సిద్ధం అవుతుంటారు. కాంప్రహెన్షివ్ అప్రోచ్ ఉండదు. ఇది సరైనదికాదు. వర్తమాన సంఘటనలు సిద్ధం అవుతున్నప్పుడు అభ్యర్థులు ఆయా అంశాలను మూడు భాగాలుగా పరిశీలించాలి. అవి..
1. వర్తమాన సంఘటన
2. జీకే పాయింట్ 3. జనరల్ స్టడీస్ పాయింట్.
ప్రతి భాగాన్ని ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ కోణంలో చూడాలి. అంటే ఒక వర్తమాన సంఘటన జరిగితే దానికి సంబంధించి ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో ఎలా ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా సివిల్స్ , గ్రూప్స్ మెయిన్స్ తదితర ప్రతిష్ఠాత్మక పరీక్షలకు ప్రశ్నలు ఎలా అడుగుతారో ఊహించగలగాలి. నిజానికి మూడు నుంచి నాలుగు నెలల పాటు కరెంట్ ఎఫైర్స్‌ను కాంప్రహెన్షివ్ విధానంలో సిద్ధం అయితే జీకే, జనరల్ స్టడీస్‌లో కూడా మంచి పట్టు వస్తుంది. ఎలాగో పరిశీలిద్దాం..
1. ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగపు
అధికరణం -324
2. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ - వీఎస్ సంపత్
3. ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు- రాష్ట్రపతి. ఇలా కరెంట్ ఎఫైర్స్ బ్యాగ్రౌండర్‌గా ప్రశ్నలు ఉంటాయి. ఇదే జీకే విభాగంగా ప్రశ్నించాలనుకుంటే
1. దేశ తొలి ఎన్నికల కమిషనర్ ఎవరు? -
(సుకుమార్ సేన్)
2. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ వేతనం ఎంత? - రూ 90,000
ఇలా జీకేకు సిద్ధం కావాలి. అలాగే ప్రస్తుత వర్తమాన అంశానికి సంబంధించిన మాతక సబ్జెక్ట్, పాలిటీ, జనరల్‌స్టడీస్‌కు సంబంధించిన అంశం. దీనిని కేవలం ఆబ్జెక్టివ్ నేపథ్యంలో కాకుండా సబ్జెక్టివ్ రూపంలో కూడా సిద్ధం అయితే మెయిన్స్ పరీక్షలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
1. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఏ పద్ధతిలో తొలగిస్తారు (పార్లమెంట్ ద్వారా, ఇంపీచ్‌మెంట్).
మెయిన్స్‌లో అడగాలనుకుంటే...
1. భారత దేశంలో ఎన్నికల నిర్వహణ
2. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల సంఘం పాత్ర.
ఇలా ఎన్ని కోణాల్లో ప్రశ్నలు అడుగుతారో అన్నింటినీ పసిగట్టగలగాలి. మరో అంశంతో వర్తమాన అంశం జీకే, జనరల్ స్టడీస్ ప్రశ్నల తీరును పరిశీలిద్దాం..
వర్తమాన అంశం- సుప్రీంకోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఆర్‌ఎం లోధా నియామకం.
వర్తమాన అంశం- ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి
- జస్టిస్ సదాశివం
- సదాశివం దేశానికి ఎన్నో ప్రధాన న్యాయమూర్తి
- 40వ. ఇదే అంశం జీకే విభాగంగా ప్రశ్నిస్తే..
- 1. దేశ తొలి ప్రధాన న్యాయమూర్తి
- హెచ్ జే కానియా
2. దేశ ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం కొనసాగిన వారు - వైవీ చంద్రచూడ్
3. కేవలం 17 రోజులు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నది- కమల్ సింగ్.
ఇదే అంశాన్ని పాలిటీకి విస్తరిస్తే..
1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు- రాష్ట్రపతి
2. సుప్రీంకోర్టు ను రాష్ట్రపతి ఏ రాజ్యంగపు అధికరణ ప్రకారం సలహా అడగవచ్చు- 143
3. సుప్రీంకోర్టు కు సంబంధించిన రాజ్యాంగపు అధికరణం - 124..
ఇంక ఎన్నో రకాలుగా ప్రశ్నలు ఉంటాయి.
పాలిటీ విభాగానికి సంబంధించి మెయిన్స్ తరహా ప్రశ్నలు పరిశీలిస్తే..
1. న్యాయ విభాగానికి సంబంధించి జ్యుడీషియల్ కమిషన్ బిల్లుకు సంబంధించిన పూర్వపరాలు.
2. సుప్రీంకోర్టు అధికారాలు 3. సుప్రీంకోర్ట్‌కు ఉన్న న్యాయ సమీక్ష అధికారం
4. సుప్రీంకోర్టు జారీ చేసే రిట్లు 5. ప్రాథమికహక్కులను కాపాడడానికి సుప్రీం వెలువరించిన తీర్పులు. ఇలా ఎన్ని కోణాలు సాధ్యం అవుతాయో అన్నింటిని పరిశీలించాలి.
ఒక చిన్న వర్తమాన అంశాన్ని అలాగే చూస్తే ప్రిపరేషన్‌లో అసమగ్రత ఉం టుంది. దానిని బ్రాడ్‌గా చూస్తే ఎంతో నేర్చుకోవచ్చు.
Also read:
Also read:
- గ్రూప్-1 మెయిన్స్‌లో సమాధానాలు రాయడంలో సమాధానాలు పాయింట్లుగా రాయాలాలేక పేరాలుగా రాయవచ్చా? పేరాలుగా రాసే పక్షంలో పాయింట్లను అండర్‌లైన్చేయవచ్చా?
- గ్రూప్-1 మెయిన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌లో ఇటీవల ప్రశ్నలు చాలా లోతుగావస్తున్నాయి. ప్రత్యేకంగా స్పెషలైజేషన్ చేసిన వారు మాత్రమే సమాధానాలు రాసే విధంగాఉంటున్నాయి. వీటికి సమాధానాలు రాయాలంటే ఎలా ప్రిపేర్ కావాలి?
- ఎపిపిఎస్‌సి ఎగ్జామ్స్ దీర్ఘకాలిక వ్యూహం విజయసోపానం!
- APPSC Group 1 Exam Eligibility Details & Salary, Pay scale of Group 1 Posts
Advertisements
No comments:
Post a Comment