Advertisements

May 14, 2014

Bank Po Reasoning Preparation Tips

ఏ పోటీపరీక్షలో అయినా అరిథ్‌మెటిక్, రీజనింగ్ చాలా ముఖ్య విభాగాలు. అభ్యర్థులు మానసిక సామర్ధ్యం, పరిశీలనా శక్తి, విశ్లేషణ పరిజ్ఞానం, సాధారణ గణిత సామర్ధ్యాలను అంచనా వేయడానికి ఈ రెండు విభాగాలను ఉపయోగిస్తారు. సివిల్స్ మొదలు రైల్వేలో అతిచిన్న ఉద్యోగాల భర్తీలోనూ ఈ విభాగానిది ముఖ్యభూమిక. ముఖ్యంగా బ్యాంకింగ్ పరీక్షల్లో ఈ రెండు విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ప్రశ్నల కఠినస్థాయిని పరిశీలిస్తే బ్యాంకింగ్ పరీక్షల్లో ఇవి చాలా కష్టంగా ఉంటాయి.

బ్యాంక్ పరీక్షకు సిద్ధమైన విద్యార్థులు అరిథ్‌మెటిక్, రీజనింగ్ విభాగాలకు సంబంధించి అన్ని పరీక్షలను సులువుగా ఎదుర్కొనగలరు. అరిథ్‌మెటిక్‌లో సాధారణంగా కనిపించే అంశాలు- బోడ్మాస్ ఆధారిత ప్రశ్నలు, సరాసరి, శాతాలు, సరళ, చక్రవడ్డీలు, పని-కాలం, పని-దూరం, వైశాల్యాలు, చుట్టుకొలతలు.అన్ని పరీక్షలకు ఒకే రీతిన సిద్ధం కావడం సరైనది కాదు. బ్యాంకింగ్‌రంగ పరీక్షల్లో సమయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లు కాన్సెప్ట్ నేర్చుకోవడం, షార్ట్‌కట్స్ తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేయడం అన్న మూడు దశల్లో ప్రిపరేషన్ కొనసాగించాలి. 


అలాగే రాష్ట్రంలో నిర్వహించే ఎస్.ఐ. పరీక్షలోనూ అరిథ్‌మెటిక్ విభాగానికి సంబంధించి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పరీక్షకు సిద్ధం అవుతున్న వాళ్లు కూడా వేగంగా సమాధానం కనుగొనేలా ప్రాక్టీస్ చేయాలి. ఇక సీ-శాట్, గ్రూప్ పరీక్షలకు సిద్ధం అవుతున్న వాళ్లు షార్ట్‌కట్స్ తెలుసుకోకున్నా పర్వాలేదు, కాన్సెప్ట్ తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేయడం వరకు పరిమితం అయితే చాలు. ఇవే అంశాలు రీజనింగ్‌కు కూడా వర్తిస్తాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రశ్నలస్థాయి చాలా కఠినంగా ఉంటుంది. ఈ విభాగానికి సంబంధించి కూడా కాన్సెప్ట్‌ను తెలుసుకోవడం, షార్ట్‌కట్స్, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడం మంచిది. 



కాన్సెప్ట్ బిల్డింగ్ ఎలా?
 
కామన్ లాజిక్ ఆధారంగా కాన్సెప్ట్‌లను నిర్మించుకోవాలి. అరిథ్‌మెటిక్ ప్రశ్నలనే పరిశీలస్తే శాతాలు, లాభ-నష్టాలు పాఫిట్ అండ్ లాస్) అంశాలకు సంబంధించి దాదాపుగా ఒకే తరహా తార్కిక పరిజ్ఞానం అవసరం. జవాబులను ఎక్కువ మేర శాతాల్లో కనుగొనాల్సి వస్తుంది. శాతం అంటే ప్రతి 100కు అని అర్థం. సాధారణంగా చాలా మంది విద్యార్థులు అంశాన్ని అవగాహన చేసుకోకుండా కేవలం బట్టి విధానంలో సిద్ధం అవుతారు. అలాంటి వాళ్లు ప్రశ్నను విభిన్న కోణాల్లో ఇస్తే జవాబును గుర్తించలేరు. ఉదాహరణకు...



ఒక వస్తువును రూ. 20కి కొని, రూ. 25కి అమ్మితే లాభశాతం ఎంత?
వస్తువు ధర రూ. 20. అమ్మింది రూ. 25కు. అంటే రూ 5 లాభం. ఇదే శాతంలో చెప్పాలంటే దాని అర్థం ఏమిటంటే ఒకవేళ వస్తువు ధర రూ. 100 అయితే అమ్మిన వెల ఎంత?
రూ. 20 వస్తువు ధర రూ. 100 అయితే.. అంటే 20x5=100 వస్తుంది. అంటే రూ.20ని ఐదు సంఖ్యతో గుణిస్తే 100 వస్తుంది. అలాంటప్పుడు రూ. 25ని కూడా 5తో గుణించాలి. అప్పుడు 25x5=125 అవుతుంది. 125 అంటే 25 ఎక్కువ ఉంది. కాబట్టి లాభశాతం 25.చాలామంది శాతాలను కనుగొనేప్పుడు 5/20 వేయాలా లేదా 5/25 వేయాలా అన్న మీమాంసలో ఉంటారు. కేవలం సూత్రాల ప్రాతిపదికన వెళ్లేవాళ్లకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు.



పైన చెప్పినట్లు కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుంటే 100కు కనుగొనాలి కాబట్టి ఆ రీతిన సమీకరణాన్ని వేసుకుంటాం. పని-కాలం, పైప్స్-సిస్ట్రన్స్, కాలం-దూరం, రైళ్లు, నిష్పత్తులు, భాగస్వామ్యం, సరళ, చక్రవడ్డీ ఇలా అన్ని అధ్యాయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అలాగే ఒకటి కంటే ఎక్కువ అధ్యాయాలపైన కూడా సారూప్య ప్రిపరేషన్ అవసరం. ఉదాహరణకు సరాసరి, భాగస్వామ్యం, నిష్పత్తులు. ఈ మూడింటికి ఒకే తరహా తార్కిక జ్ఞానం అవసరం. అలాగే అలిగేషన్ అండ్ మిక్చర్, లాభ-నష్టాలు అధ్యాయాలకు సంబంధించి కూడా ఒకేతరహా గణిత, తార్కిక పరిజ్ఞానం అవసరమవుతుంది. రీజనింగ్ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు బ్యాంకింగ్‌రంగ పరీక్షల్లో కఠినంగా ఉంటాయి. ఇందులో ఆల్ఫాబెట్ బేస్డ్ ప్రశ్నలు, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్-డికోడింగ్, ఫజిల్స్, సిట్టింగ్ అరెంజ్‌మెంట్, సిలాజిసం, డైరెక్షన్, అంశాలు ఉంటాయి. ఇవి సాధారణంగా అని పోటీపరీక్షల్లో వస్తాయి.



ఈ అంశాలకు సంబంధించి కూడా కాన్సెప్ట్ సిద్ధం కావడంతో పాటు ఎన్నో ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ఎక్కువగా బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, ఫజిల్ టెస్ట్, సిట్టింగ్ అరెంజ్‌మెంట్ అంశాల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించి ఇన్ని తక్కువ అంశాలు సరిపోవు, బ్యాంకింగ్ పరీక్షల్లో ఎలిజిబిలిటి టెస్ట్, కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్‌మెంట్స్-ఆర్గ్యుమెంట్స్, స్టేట్‌మెంట్-అసంప్షన్స్, కాస్ అండ్ ఎఫెక్ట్ తదితర అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. వీటిని కూడా విస్త్రతంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 



-రీజనింగ్ విభాగానికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలో జనరల్ ఇంటలిజెన్స్ పేరుతో ఇస్తున్నారు. ఇందులో నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా ఉంటుంది. 
-ఒకప్పుడు బ్యాంకింగ్ పరీక్షల్లో సైతం నాన్ వెర్బల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చేవి అయితే పరీక్ష ఆన్‌లైన్‌గా మారినప్పటి నుంచి రావడం లేదు.
-సీ-శాట్, గ్రూప్-1, 2, ఎస్.ఐ. తదితర పరీక్షల్లో గతంలో నాన్‌వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడిగేవారు. 
-నాన్‌వెర్బల్‌కు సంబంధించి బేసిక్స్ అంటూ ఉండవు. కేవలం ప్రాక్టీస్‌పైనే ఆధారపడాలి. 
-రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పిలిమ్స్) ఎస్.ఐ. పరీక్షలో సిలాజిసం అంశం నుంచి ప్రశ్నలు వచ్చాయి
-రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-4లో సెక్రటరియల్ ఎబిలిటీలో ప్రశ్నలు రీజనింగ్, అర్థమెటిక్ అంశాల నుంచి వస్తాయి
-బ్యాంకింగ్ పరీక్షల్లో వచ్చే డాటా ఇంటర్‌ప్రిటేషన్ చాలా కీలకం. ఐబీపీఎస్ నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్ల పరీక్షలో ఈ విభాగం నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. అదే ఎస్‌బీఐ. నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్ల పరీక్షలో ఏకంగా 45 మార్కులకు వస్తాయి. అదే విధంగా గ్రూప్-1, మెయిన్స్‌లో డాటా ఇంటర్‌ప్రిటేషన్‌కు ఒక పేపర్ కేటాయించారు. సీ-శాట్ పేపర్‌లోను ఈ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి.

Advertisements

No comments:

Followers