1323లో జునాఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని పతనం చేసి దానికి సుల్తాన్‌పూర్‌గా నామకరణం చేశాడు. తన ప్రతినిధిగా మాలిక్‌నబీని నియమించి వెళ్లాడు. కాకతీయ, మధురై రాజ్యాలను ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. దీంతో ఆ రెండు రాజ్యాలు ఢిల్లీ సామ్రాజ్యంలో రెండు రాష్ర్టాలుగా ఏర్పడ్డాయి. ఆంధ్రనగరిగా పిలువబడే ఓరుగల్లు సుల్తాన్‌పూర్ అయ్యింది. దీనికి మాలిక్ బర్వన్ ఉద్దిన్ గవర్నర్‌గా నియమించబడ్డాడు. మధురై రాష్ర్టానికి జలాలుద్దిన్ హసన్‌షా రాజుగా నియమితుడయ్యాడు. ఓరుగల్లుకు మాలిక్ మక్బూల్ వజీరయ్యాడు. ప్రతాపరుద్రుని కాలంనాటి గన్నమ నాయుడు మతం మార్చుకొని మాలిక్ మక్బూల్‌గా మారాడు.
-దక్షిణ భారతదేశంలో మహ్మద్‌బిన్ తుగ్లక్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. వ్యతిరేక ఉద్యమాలు స్వతంత్య్ర రాజ్యాలకై జరిగాయి. ప్రతాపరుద్రుని కొలువులో సేనాని అయిన రేచెర్ల సింగమనాయకుడు దక్షిణ తెలంగాణలో స్వతంత్రించి పద్మనాయక లేదా రేచర్ల వంశం స్థాపించాడు. ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ముస్లింలను పారదోలి రేఖపల్లి (ఖమ్మం) రాజధానిగా ప్రోలయ స్వతంత్య్ర రాజ్యం స్థాపించాడు.
-దక్షిణ తీరాంధ్రలో 1325 నాటికే ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్యం స్థాపించాడు. అద్దంకి రాజధానిగా చేసుకున్నాడు. రాయలసీమలో అరవీటి సోమదేవరాజు స్వతంత్రించాడు. కంపిలిలో 1336లో హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. నస్రత్‌ఖాన్ బీదర్‌లో స్వతంత్ర రాజ్యం స్థాపించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 1347లో హసన్‌గంగూ గుల్బర్గాలో బహ్మని రాజ్యం స్థాపించాడు. మహ్మద్‌బిన్ తుగ్లక్ ఢిల్లీ ఢిల్తాన్‌గా ఉన్న సమయంలో ఏర్పడిన దక్షిణ భారతంలోని రాజ్యాలు..
-1. 1324- రేచెర్ల వెల్మవంశం: సింగమనాయుడు-2. 1325- ముసునూరి వంశం: ప్రోలయ నాయకుడు
-3. 1325- రెడ్డి రాజ్యం: ప్రోలయ వేమారెడ్డి
-4. 1336- విజయనగర రాజ్యం : హరిహర + బుక్కరాయలు
-5. 1347- బహ్మని రాజ్యం: హసన్ గంగూ
Also Read:
- Part 4: Andhra History Bits for APPSC Exams
- Part 3: 40+ Andhra History Bits for APPSC Exams
- Do Satavahanas belonged to the Andhra Community? -Identity of the Satavahanas
- Eastern Chalukyas of Vengi - Political Administation
- Conditions in Andhra before Satavahanas
Advertisements
No comments:
Post a Comment