Advertisements

April 1, 2014

Part13: Qutab Shahi dynasty

Andhra History in Telugu Medium, SOCIAL AND CULTURAL HISTORY OF ANDHRA PRADESH, A.P History Class Notes PDF, Xerox Material, Andhra Pradesh History for APPSC Group 2 Exam, Group 1 exam, Paper 2 , Section 1, chapter wise material download, Andhra Pradesh Public Service Commission Material for Groups


Andhra History Other Important Notes
5) Buddhism in Andhra          
14) British Rule in Andhra     
23) Telangana Armed Struggle         

కుతుబ్‌షాహీల కాలంనాటి సాంఘిక పరిస్థితులు: యూరోపియన్ యాత్రికులు, వర్తకులు, రాయబారులు రాసిన గ్రంథాల ద్వారా కుతుబ్‌షాహీల కాలంనాటి మత-సాంఘిక పరిస్థితులు తెలుస్తున్నాయి. గోల్కొండ నవాబుల రాజభాష పారశీకం అయినా, తెలుగు భాష కూడా వారి పాలనలో మంచి అభివృద్ధినే సాధించింది. తెలుగు, దక్కనీ ఉర్దూ, పారశీక భాషలు ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. ఈ యుగంలో మతమౌఢ్యాలు, మూఢాచారాలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. జ్యోతిషం, ముహూర్త బలాలు, దుష్టఘడియల ప్రమాదాలు, సూర్య చంద్రులను, నక్షత్రాల్ని దేవతలుగా నమ్మడం లాంటివి ఉన్నట్లు బెర్నియర్ రాశాడు. బ్రాహ్మణులకు గణితం, జ్యోతిషం,   ఖగోళ శాస్త్రాల్లో  మంచి పరిజ్ఞానం ఉందని మూర్‌ల్యాండ్  పేర్కొన్నాడు. వైశ్యులు వర్తకం చేసేవారని, గణితంలో వీరికి మంచి పట్టు ఉండేదని బౌరే రాశాడు. శూద్రులు ప్రభువుల వద్ద సేవకులుగా, సైనికులుగా పనిచేసేవారని మెత్‌హాల్డ్ పేర్కొన్నాడు.

 సంఘంలో వితంతువులది బాధాకరమైన స్థితి. నగలు పెట్టుకోకూడదు,  శుభ్రమైన దుస్తు లు ధరించకూడదు.  బంధువులకు దూరంగా  ఉండేవారు.  సమాజంలో వేశ్యలకు గౌరవం ఉండేది. వారికి  అండగా  పాలకవర్గం ఉండేది. గోల్కొండలో 20 వేల మంది వేశ్యలు ఉండే వారని టావెర్నియర్ రాశాడు. వారికి ప్రభుత్వం లెసైన్సులు ఇచ్చేది. వారి నుంచి పన్నులు వసూలు చేసేవారు కాదు. దేవదాసీలకు సంఘంలో మంచి గౌరవం ఉంది. హైదరాబాద్ నగర నిర్మాత మహ్మద్ కులీకుతుబ్‌షా ‘కుల్లియత్’ అనే గ్రంథాన్ని ఉర్దూ భాషలో రచించాడు. ఇందులో హిందువుల, ముస్లింల పండగల గురించి వివరించాడు. మొహర్రం, రంజాన్, దీపావళి, హోళీ, వసంతోత్సవం లాంటి పండగలను వర్ణించాడు. మహమ్మదీయుల వాస్తు కట్టడాల్లో పూర్ణ కుంభం, లతాపద్మాలు, హంసలు, ఏనుగులు లాంటి హిందూ వాస్తు సంప్రదాయాలు ప్రవేశించాయి. కుతుబ్‌షాహీలు పారశీక దేశం నుంచి వచ్చిన షియా మతస్థులు. షియా సంప్రదాయానికి సహజమైన సహనాన్ని  పరిపాలనలో ప్రదర్శించారు. జాతి, మత విభేదాలు పాటించకుండా, అర్హత ఉన్నవాళ్లకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి, తెలుగువారి సహాయంతో ఆంధ్రదేశాన్ని సమైక్యం చేశారు.
 వాస్తు - స్మారక నిర్మాణాలు
 గోల్కొండ కుతుబ్‌షాహీల కట్టడాలు, షియామత సూత్రాలకు అనుగుణంగా పారశీక, బహమనీ హిందూ సంప్రదాయాల సమ్మేళనంగా ఉంటాయి. ఈ శైలిలో గుమ్మటాలు, కమాన్‌లు, మీనార్లు ఉంటాయి. పుష్పాలు, లతలు, పక్షులు ఈ నిర్మాణాల్లో కన్పిస్తాయి. వాస్తుపరంగా విశిష్టమైన కుతుబ్‌షాహీ శైలి వెలుగులోకి వచ్చింది. వీరు ప్రధానంగా పారశీక వాస్తుతో పాటు బహమనీ సుల్తానుల వాస్తునే అనుసరించారు. పెద్ద గుమ్మటాలు, విశాలమైన ప్రవేశ ద్వారాలు,  ఎత్తయిన మీనార్లు అష్ట కోణాకృతి నిర్మాణాలు ఈ శైలికి ముఖ్య లక్షణాలు. హైదరాబాద్‌లోని చార్మినార్, చార్‌కమాన్, మక్కామసీదు, టోలీ మసీదు, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీల సమాధులు, బాదుషాహీ అసూర్‌ఖానా లాంటి నిర్మాణాలు, కుతుబ్‌షాహీ వాస్తుకు అద్దం పడతాయి.
 కుతుబ్‌షాహీ మూడో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మూసీనదిపై క్రీ.శ. 1578 పురానాఫూల్ (పాతవంతెన)ను నిర్మించారు. ఇతడి కాలంలోనే హుస్సేన్ సాగర్, బద్వేల్, ఇబ్రహీంపట్నం, గోల్కొండ కోటలోని ఇబ్రహీం మసీదులను నిర్మించారు. మహ్మద్ కులీకుతుబ్ తన ప్రేయసి భాగమతి పేరుపై మూసీ నది దక్షిణ ప్రాంతంలో క్రీ.శ. 1591లో చిచిలం గ్రామం (ప్రస్తుత షా-ఆలి-బండ ప్రాంతం)లో ప్లేగు వ్యాధి నివారణకు జ్ఞాపకంగా నాలుగురోడ్ల కూడలి మధ్య   చార్మినార్‌ను    నిర్మించాడు. చార్మినార్ పక్కనే ఉన్న జమామసీదును 1594లో కులీ నిర్మించాడు. దీంతోపాటు మహ్మద్ కులీ పత్తర్‌గట్టి ప్రాంతం (హైదరాబాద్)లో బాదుషాహీ అసూర్‌ఖానా, దారుల్‌షిఫా(ఆసుపత్రి), చార్ కమాన్ లాంటి నిర్మాణాలు చేశాడు. వీటిని రాయి, సున్నంతో నిర్మించారు. కులీ కుతుబ్‌షా అల్లుడైన మహ్మద్ కుతుబ్‌షా (క్రీ.శ. 1612- 1626)  దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మక్కా మసీదును క్రీ.శ. 1617లో నిర్మించాడు.
 కుతుబ్‌షాహీల ఇతర స్మారక నిర్మాణాలు, గోల్కొండ కోట అంతర్భాగంలో భక్తరామదాసు బందిఖానా, రాణీమహల్‌లు, సుల్తాన్‌ల మరణాంతరం ఖననానికి ముందు స్నానం చేయించే  గదులు నేటికీ ఉన్నాయి. సుమారు వంద ఎకరాల స్థలంలో నిర్మించిన కుతుబ్‌షాహీల సమాధులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాస్తు నిర్మాణాలు. ఒకే రాజవంశానికి చెందిన సుల్తానుల సమాధులన్నీ (అబుల్ హసన్ తానీషా తప్ప) ఒకే ప్రాంగణంలో నిర్మించడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కన్పించదు. సమాధుల డోమ్ అంతర్భాగాన్ని అష్టకోణాకృతిలో ప్రత్యేక పరిజ్ఞానంతో నిర్మించారు. కుతుబ్‌షాహీల కాలంనాటి చిత్రకళ, మొగలులు, హిందూ- పారశీక సంప్రదాయం లో దక్కనీ చిత్రకళ చరిత్రలో పేరుగాంచింది. తారీక్ హుస్సేన్ ‘షాహిద్ -షాహీ దక్కన్’  గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి. మహమ్మద్  కులీకుతుబ్‌షా రచించిన ‘కుల్లియత్’ గ్రంథంలో 14 సూక్ష్మచిత్రాలు (మీనియేచర్ చిత్రాలు) ఉన్నాయి.  దక్కను ఉర్దూలో రాసిన మొదటి  గ్రంథంగా ‘కుల్లియత్’ను పేర్కొంటారు.
Andhra History in Telugu Medium, SOCIAL AND CULTURAL HISTORY OF ANDHRA PRADESH, A.P History Class Notes PDF, Xerox Material, Andhra Pradesh History for APPSC Group 2 Exam, Group 1 exam, Paper 2 , Section 1, chapter wise material download, Andhra Pradesh Public Service Commission Material for Groups


Andhra History in Telugu Medium, SOCIAL AND CULTURAL HISTORY OF ANDHRA PRADESH, A.P History Class Notes PDF, Xerox Material, Andhra Pradesh History for APPSC Group 2 Exam, Group 1 exam, Paper 2 , Section 1, chapter wise material download, Andhra Pradesh Public Service Commission Material for Groups


Andhra History in Telugu Medium, SOCIAL AND CULTURAL HISTORY OF ANDHRA PRADESH, A.P History Class Notes PDF, Xerox Material, Andhra Pradesh History for APPSC Group 2 Exam, Group 1 exam, Paper 2 , Section 1, chapter wise material download, Andhra Pradesh Public Service Commission Material for Groups


Andhra History in Telugu Medium, SOCIAL AND CULTURAL HISTORY OF ANDHRA PRADESH, A.P History Class Notes PDF, Xerox Material, Andhra Pradesh History for APPSC Group 2 Exam, Group 1 exam, Paper 2 , Section 1, chapter wise material download, Andhra Pradesh Public Service Commission Material for Groups

1.    ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత ఎవరు?
      సురవరం ప్రతాపరెడ్డి    
 2.    ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ను శంకరకవి  ఏ భాషలో రచించాడు?
      తెలుగు
 3.    కుతుబ్‌షాహీల రాజభాష ఏది?
      పారశీకం
 4.    ఏ గోల్కొండ నవాబును కవులు తమ రచనల్లో ఇభరాముడని కీర్తించారు?
      ఇబ్రహీం కుతుబ్‌షా (మూడో నవాబు)
 5.    ‘సుగ్రీవ విజయం’ యక్షగాన నాటకం తెలుగుభాషలో మొదటిది. దాని రచయిత ఎవరు?
      కందుకూరి రుద్రకవి
 6.    ‘నిరంకుశోపాఖ్యానం’ అనే శృంగార కావ్యాన్ని తెలుగుభాషలో ఎవరు రచించారు?
      కందుకూరి రుద్రకవి
 7.    పొన్నగంటి తెలగనార్యుడు ‘యయాతి చరిత్ర’ అనే అచ్చతెలుగు కావ్యాన్ని  ఎవరికి అంకితమిచ్చాడు?
      గోల్కొండ తరఫీదార్ అమీన్‌ఖాన్
 8.    మహ్మద్ కులీ కుతుబ్‌షా గోల్కొండ పాలకుల్లో ఎన్నో సుల్తాన్?
      ఐదు
 9.    ‘వైజయంతీ విలాసం’ అనే శృంగార కావ్యాన్ని రచించిన సారంగు తమ్మయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
      మహ్మద్ కులీ కుతుబ్‌షా
 10.    {పసిద్ధ పదకర్త, మువ్వగోపాల పదాలు రచయిత క్షేత్రయ్య ఏ కుతుబ్‌షాహీ పాలకుడికి సమకాలీకుడు?
      అబ్దుల్లా కుతుబ్‌షా
 11.    దాశరథీ శతకం రచయిత?
      కంచర్ల గోపన్న
 12.    కూచిపూడి (కృష్ణా జిల్లా) నాట్యాచార్యుల  సేవలకు గుర్తింపుగా ఏ గోల్కొండ నవాబు   ‘కూచిపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా దానం చేశాడు?
      అబుల్ హసన్ తానీషా
 13.    మూసీ నదిపై  పురానాపూల్ (వంతెన)ను క్రీ.శ. 1578లో  ఏ గోల్కొండ నవాబు నిర్మించాడు?
      ఇబ్రహీం కుతుబ్‌షా
 14.    మహ్మద్ కులీ కుతుబ్‌షా చార్మినార్‌ని  ఎప్పుడు నిర్మించాడు?
      {Mీ.శ. 1591లో
 15.    దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన మక్కా మసీదును హైదరాబాద్‌లో  ఏ గోల్కొండ నవాబు నిర్మించాడు?
      మహ్మద్ కుతుబ్‌షా
 16.    తొలి ఉర్దూ గ్రంథంగా పేరు పొందిన ‘కుల్లియత్’ను ఎవరు రచించారు?
      మహ్మద్ కులీ కుతుబ్‌షా
 17.    గోల్కొండ సుల్తాన్‌లలో చివరి నవాబు?
      అబుల్ హసన్ తానీషా
 18.    గోల్కొండను స్వాధీనం చేసుకోవడానికి 1687లో మొగలు చక్రవర్తి ఔరంగజేబుకు ఎన్ని నెలల కాలం పట్టింది?
      8 నెలలు
 19.    కుతుబ్‌షాహీ - గోల్కొండ రాజ్యస్థాపకుడు?  
      సుల్తాన్ కుతుబ్ - ఉల్- ముల్క్
 20.    కైఫీయతులు అంటే ఏమిటి?
      స్థానిక కథనాలు
 21.    కుతుబ్‌షాహీలు ఏ మహ్మదీయ శాఖకు చెందినవారు?
      షియా మతస్థులు    
 22.    మజ్లిస్ - దివాన్ దరి - మజ్లిస్ - ఇ - కింగాష్‌లు దేన్ని సూచిస్తాయి?
      సుల్తాన్‌కు సలహాలు ఇవ్వడానికి  ఏర్పాటు చేసిన పండిత పరిషత్తులు
 23.    పీష్వా, దివాన్ పదాలు దేన్ని సూచిస్తాయి?
      {పధానమంత్రి పదవి    
 24. గోల్కొండ చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా ప్రధాన మంత్రి ఎవరు?
      మాదన్న    
 25.    అబుల్‌హసన్ తానీషా సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు?
      అక్కన్న    
 26.    మీర్ జుమ్లా అంటే ఎవరు?
      మంత్రి (ఆర్థిక - రెవెన్యూ శాఖల అధిపతి)     
 27.    కుతుబ్‌షాహీల కాలంలో మజుందార్ అంటే ఎవరు?
      గణాంకాధికారి    
 28.    కుతుబ్‌షాహీల తరఫీలు (రాష్ట్రాలకు) అధిపతి ఎవరు?
      తరఫీదార్ (గవర్నర్)    
 29.    కొత్వాల్ అంటే ఎవరు?
      రక్షక భటాధికారి    
 30.    కుతుబ్‌షాహీల  పాలనలో ప్రధాన రేవు అధికారిని  ఏమని పిలిచేవారు?
      షా బందర్    
 31.    గోల్కొండ రాజ్యంలో గ్రామ వ్యవహారా లను ఎవరు నిర్వహించేవారు?
      బారా బలవంతులు (పన్నిద్ధరు ఆయగాండ్రు)    
 32.    గోల్కొండ సైన్యం  ఎవరి పర్యవేక్షణలో ఉండేది?
      ఐనుల్ ముల్క్    
 33.    1687లో ఔరంగజేబు కాలంలో గోల్కొండ కోటను ముట్టడించారు. అప్పటి కుతుబ్‌షాహీ చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా సైన్యాధ్యక్షుడు?
      అబ్దుల్ రజాక్ లారీ

Advertisements

No comments:

Followers