-పద్మనాయక వంశానికి మూలం రేచెర్ల రెడ్లు. రేచెర్ల నామిరెడ్డి మేనల్లుడైన చెవ్విరెడ్డి (బేతాళ/భేతాళ రెడ్డి, బేతాళనాయకుడు) పద్మనాయక వంశానికి మూల పురుశుడు. వీరి పూర్వులు భేతిరెడ్డి, చెవ్విరెడ్డి మున్నగు నామములు. వీరిని రెడ్డి తెగవారిగా సూచిస్తుండగా మధ్యకాలంలో సేనా నాయకత్వం సూచించు నాయుడు బిరుదును బట్టి వీరిని వేర్వేరుగా భావించుచున్నది. చెవ్విరెడ్డి వంశస్థులే వైష్ణవ మతాన్ని స్వీకరించి సంస్కరణ మార్గంలో పయనించి వెల్మలై రేచెర్ల పద్మనాయకులయ్యారు. రేచర్ల పద్మనాయకులు నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాడు ప్రాంతాలను మహాసామంతులుగా పాలించారు.
-కాకతీయ సామ్రాజ్య పతనానంతరం, ఢిల్లీ సుల్తానులను, బహ్మనీ సుల్తానులను అరికట్టి తెలంగాణను పాలించిన వారు రేచెర్ల పద్మనాయకులు. వీరు కొన్ని సందర్భాల్లో తెలంగాణేతర ప్రాంతాలను జయించినా కొంతకాలం తర్వాత వాటిని కోల్పోయారు. ఆమనగల్లు వీరి జన్మస్థలం. రేచెర్ల రెడ్లకు, కందూరి చోడులకు ఆమనగల్లు మొదట రాజధాని. చెవ్విరెడ్డిని గణపతి దేవుడు ఆమనగల్లు పాలకుడిగా నియమించాడు. చెవ్విరెడ్డికి నలుగురు కుమారులు. వారిలో..
1. దామానాయుడు
2. ప్రసాదిత్యనాయుడు.
-తండ్రి రాజ్యాన్ని పాలిస్తుంగా వీరు రుద్రమదేవికి సేనానులుగా కాకతీయ రాజ్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు. రుద్రమదేవి రాజ్యానికి రాగా నే ఒక స్త్రీ రాజుగా రావడం సహించక ఒకవైపు బంధువర్గం, మరోవైపు యాదవ రాజులు ఓరుగల్లుపై దండెత్తారు. ఈ సమయంలో ప్రసాదిత్య నాయుడు ఈ చిక్కులను తొలగించి ఆమె అధికారాన్ని నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయ పితామహాంక అనే బిరుదులు పొందాడు. కాకతీయ సామ్రాజ్య పరిరక్షణలో భాగంగా నాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘతన ఇతనిదే.
-ప్రసాదిత్య నాయుడి కుమారుడు వెన్నమ నాయకుడు ప్రతాపరుద్రుడి సేనానిగా ప్రసిద్ధ్దుడు. క్రీ.శ. 1303లో అల్లాఉద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యం పై చేసిన దండయాత్రను తిప్పికొట్టిన వారిలో ఇతడు ప్రముఖుడు. వెన్నమ నాయకుడి కొడుకు ఎరదాచానాయకుడు, సబ్బినాయుడు కొడుకు నలదాచానాయకుడు కూడా ప్రతాపరుద్రుని సేనానులే.
-కాకతీయులకు,పాండ్యరాజులకు(1326),హోయసాల రాజులతో జరిగిన యుద్ధాల్లో మిగతా సేనానులతో పాటు ఎరదాచానాయకుడు కీలక పాత్ర వహించాడు. ఇతని పరాక్రమానికి మెచ్చి ఇతనికి ప్రతాపరుద్రుడు.
1. పంచపాండ్యదళ విభాళ.
2. పాండ్యగజకేసరి. అనే బిరుదులు ఇచ్చాడు.
-ఎరదాచానాయకుడి తర్వాత సింగమనాయకుడు (1326-61) రాజ్యానికి వచ్చాడు. ఇతడు ప్రసిద్ధుడు. తండ్రితోపాటు పాండ్య యుద్ధంలో పాల్గొని చిన్నతనంలోనే పరాక్రమం చూపించి కంపిలి రాజ్యంతో జరిగిన యుద్ధంలో కూడా విజయం సాధించాడు.
-కాకతీయ రాజ్య పతనానంతరం సింగమనాయకుడు స్వతంత్ర రా జ్యాన్ని స్థాపించాడు. ఆమనగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. సింగమనాయకుని తర్వాత అతని కుమారులు అనపోతానాయుడు, మాదానాయుడు రాజులై జల్లిపల్లి, ఇనుగుర్తి కోటలను మట్టడించి క్షత్రీయులను చంపి పగ తీర్చుకున్నారు. కొందరు క్షత్రీయులు హుజూరాబాద్, మొలంగూర్ కోటలలో దాచుకోగా వారందరినీ చంపివేశారు. శ్రీశైల ప్రాంతాన్ని జయించి తమ రాజ్యంలో కలుపుకున్నారు. రెడ్డి రాజ్యంలో భాగమైన ధరణి కోటను ముట్టడించి అనపోతా రెడ్డిని ఓడించారు. వెల్మ, రెడ్డి రాజ్యాల వైరం ఈ రాజ్యాల పతనం దాకా కొనసాగింది.
-క్షత్రీయులలో కొందరు భువనగిరి ప్రాంతానికి చేరి అనపోతానాయుడి శత్రువులను కలుపుకొని యుద్ధానికి సిద్ధంకాగా అనపోతానాయుడి భువనగిరి సమీపంలో మూసీ తీరంలో ఇంద్య్రాల వద్ద ఎదుర్కొని జయించాడు.
-ఈ విజయాల అనంతరం రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చినాడు. అనేక పర్వత పంక్తుల మధ్య ఉన్న ఈ దుర్గం అభేద్యం. రాజధానిని పునఃనిర్మాణం చేసి 1368లో ఓరుగల్లుపై దాడి చేశాడు. ఈ యుద్ధానంతరం ఓరుగల్లు వెల్మరాజుల వశమైనది.
-అనపోతానాయుడి తర్వాత 2వ సింగభూపాలుడు 1384లో రాచకొండలో సింహాసనం అధిష్టించగా అదే ఏడాది దేవరకొండలో పెద వేదగిరి నాయుడు అధికారంలోకి వచ్చాడు. సింగభూపాలుడు రాజ్యారంభకాలంలో విజయనగర రాజు 2వ హరిహర రాయలు రాచకొండ రాజ్యంలోని కొత్త కొండపై దండెత్తాడు. సింగభూపాలుడు యువరాజుగా ఉన్నప్పుడే కళ్యాణి (గుల్బర్గా) దుర్గాన్ని ఆక్రమించాడు. అనేక యుద్ధ విద్యలో ఆరితేరినాడు. కాబట్టి విజయనగర రాజులను సైతం ఓడించాడు.
-అనంతరం సింగమభూపాలుడు కళింగ దేశాన్ని జయించడానికి వెళ్ళి గోదావరి జిల్లాలో ఉన్న బెండపూడి, వేములకొండ ప్రాంతాలను జయించి 1387 లో సింహాచలం క్షేత్రంలో శాసనం చెక్కించాడు.
-సింగభూపాలుడి తర్వాత వచ్చినవారు అసమర్దులై రాజ్యాన్ని కోల్పోయారు. అనంతరం వీరి వంశం అంతమయ్యింది.
i. కోస్తాంధ్ర ప్రాంతాన్ని - కళింగ గజపతులు
ii. తెలంగాణ ప్రాంతాన్ని - బహ్మనీలు ఆక్రమించారు.
Also Read:
- ముసునూరి నాయకులు
- కాకతీయ అనంతర రాజ్యాలు
- Part 4: Andhra History Bits for APPSC Exams
- Part 3: 40+ Andhra History Bits for APPSC Exams
- Do Satavahanas belonged to the Andhra Community? -Identity of the Satavahanas
- Eastern Chalukyas of Vengi - Political Administation
Advertisements
No comments:
Post a Comment